పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార కొరతను తీర్చడం భారతదేశంలో ఓ సవాలుగానే మిగిలింది.
వ్యవసాయాధారిత భారతదేశంలో పండించిన పంట కోతకు ముందే అకాలవర్షాల వలన, ప్రకృతి వైపరీత్యాల వలన, వృధా అవుతుంది. లేదా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వృధాను, ఈ నష్టాన్ని, తగ్గించడానికి, ఆహార లభ్యతను, పెంచడానికి, ఇంకా సహజ వనరులపై ఒత్తిడిని తగ్గించడానికి,ఆకలి బాధలనుండి ప్రజలను బయటకు తీసుకురాలేకపోవడానికి, ప్రధాన కారణం.. ధాన్యం చెడిపోకుండా వృదా కాకుండా నిల్వచేయలేకపోవడమే..
మన పూర్వీకులు, గ్రామ రైతులు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి వివిధ రకాల గోనె సంచులను, ప్లాస్టిక్ డబ్బాలను, మట్టి కుండ పాత్రలను ఉపయోగించేవారు. కానీ, నేటి ఆధునిక రైతులకు ధాన్యం నిల్వచేయడం పెద్ద సవాలుగా మారింది . సరిగ్గా నిల్వ చేయని ధాన్యం లో కీటకాలు, తెగుళ్ల వలన విత్తన బరువు తగ్గడమే కాకుండా అధిక ఉష్ణోగ్రత, తేమ వలన విత్తనంలో నాణ్యత కూడా తగ్గుతుంది. కాబట్టి, ధాన్యాన్ని సరైన పద్ధతులలో చేయడానికి కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. రాజేందర్ నగర్ లోని కృషి విజ్ఞాన కేంద్రం వారు రెండు పొరలు ఉన్న హెర్మెటిక్ సంచులలో ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతిని పరిచయం చేశారు.
ఈ సంచులు కీటకాలు, బూజు ( తెగుళ్లు) అధిక ఉష్ణోగ్రత, తేమ, పరిస్థితుల నుండి ధాన్యాన్ని కాపాడే విధంగా ఉంటాయి.
ఈ విధానంలో ధాన్యాన్ని మూసివున్న కంపార్ట్మెంట్ లోపల నిల్వ చేస్తారు. సంచికి బయట పోరగా పాలీ ప్రొఫైలిన్, లోపలిపొరను 20 మైక్రాన్ల పాలిథిన్ షీట్ తో తయారు చేస్తారు.
ఈ రకమైన హెర్మెటి, సంచులను ఉపయోగించడం వలన బూజు పెరుగుదల, తేమ,ఇతర కలుషితాల వలన ధాన్యానికి నష్టం జరగకుండా ఉంటుంది. అంతేకాకుండా వాయుమార్పిడిని కూడా తొలగిస్తాయి. బ్యాక్టీరియా చర్యలను క్రిమికీటకాలను,ఆశించడాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ సంచులలో పప్పు దినుసులు, బియ్యం,రాగులు జొన్నలు, గోధుమలను కూడా నిల్వ చేయవచ్చు. దీనివలన పురుగు పట్టకుండా సంవత్సరం పొడవునా విటిని కాపాడుకోవచ్చు. 5 కిలోల నుండి 50 కిలోల వరకు ధాన్యం నిల్వ చేసుకునేలా ఈ సంచులు అందుబాటులో ఉన్నాయి.
Share your comments