
ఇప్పటి దాక 3 ఎకరాల రైతులకి, రైతు భరోసా నిధులు చేరుకున్నాయి. అయితే ఇక 3 నుండి 4 ఎకరాల రైతులకి కూడా ఈ పెట్టుబడి సాయం అందబోతోంది. మంగళవారం 4 ఎకరాల రైతుల కోసం 200 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఇంతకుముందు 3 నుండి 4 ఎకరాల రైతుల కోసం 300 కోట్లు రైతుభరోసా నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు మొత్తం 3.33 లక్షల ఎకరాలకు, పూర్తిగా 1.06 లక్షల రైతుల అకౌంట్లలోకి జమ అయ్యింది. దీంతో ఈ వర్గం రైతులకి మొత్తం 500 కోట్ల రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి.
ఇప్పటిదాకా 54.74 లక్షల రైతులకు, రూ.4666 కోట్లకు పైగా నిధులు రేవంత్ సర్కార్ విడుదల చేసింది. 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి గాను రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 18 వేల కోట్లు కేటాయించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన రైతు భరోసా పథకం కింద, మెరుగైన విత్తనాలు, ఎరువులు మరియు నీటిపారుదలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అర్హతగల రైతులకు ఏటా ఎకరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఇప్పటిదాకా నాలుగు విడతల్లో రైతు భరోసాని మూడు లేదా అంతకంటే తక్కువ ఎకరాలు ఉన్న వ్యవసాయదారులకు మాత్రమే పెట్టుబడి సాయం కింద వర్తింపజేసింది. ఇప్పుడు 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులకు కూడా ఈ సాయం అందబోతోంది. మరో వారం లో 4 ఎకరాలు ఉన్న రైతులకు, మార్చి 31లోగా 5 ఎకరాలు ఉన్న రైతులకు కూడా అమలు చేసేటందుకు ప్రణాళిక సిద్ధం అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు పంపిణీ చేయనున్నారు.
Share your comments