
ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కానీ వరి సాగు మాత్రమే ఎక్కువగా కన్పిస్తుంది. అయితే ప్రస్తుతం జగిత్యాలలో నువ్వుల సాగు (sesame cultivation Jagtial) చేపట్టి రాబడిలో అగ్రస్థానంలో నిలిచింది. నువ్వుల పంట తక్కువ నీరు, రైతుకి భారం కానీ పెట్టుబడితో చక్కని లాభాలు అన్నదాతల చేతికి ఇస్తుంది.
జగిత్యాలలో నువ్వుల పంట (nuvvu pantalu jagtial)
ప్రస్తుతం ఈ జగిత్యాల అన్ని జిల్లాల కాకుండా, వేర్వేరు వాణిజ్య పంటలు వేసి లాభాలు గడిస్తోంది. ఇక్కడ ఎక్కువ మంది మొదటి స్తానంలో పసుపు సాగు తర్వాత స్థానంలో నువ్వులను సాగు చేస్తున్నారు. పోయిన ఏడాది రాష్ట్రంలోనే అధికంగా నువ్వుల సాగు చేసి మొదటిస్థానంలో నిల్చింది ఈ జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వులను 50 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఒక్క జగిత్యాల జిల్లాలోనే జిల్లాలో ప్రతీ యేటా 12 వేల నుంచి 15 వేల ఎకరాల్లో వేస్తున్నారు. ఈ సంవత్సరానికి 10 వేల ఎకరాలకు పైగా నువ్వు పంటను వేశారు.

నువ్వుల పంటతో లాభాలు (sesame farming benefits)
నువ్వుల పంటకి అధికంగా నీళ్లు, పెట్టుబడి అవసరం లేదు. అలానే ఎక్కువ సునాయాసంగా తట్టుకోగలిగే శక్తి ఈ పంటకు ఉంది. మార్కెట్లో కూడా నువ్వులకి మాంచి డిమాండ్ ఉంది. నువ్వుల నూనె, నువ్వు పొడి, స్వీట్లు ఇవేకాక ఎన్నో సౌందర్య ఉత్పత్తులు కూడా నువ్వులని వాడతారు. అంతేకాకుండా రష్యా, వియాత్నం, సౌత్ కొరియా, అమెరికా ఇలా పలుదేశాలకు నువ్వులను ఎగుమతి చెయ్యడంలో భారత దేశం అగ్రగణ్యంగా ఉంది. కాబట్టి ఎప్పుడు నువ్వులకి మార్కెట్ పడిపోతుంది అని రైతులకి భయం అవసరం లేదు.
యాసంగి సీజన్ లో పంట (Yasangi season crops)
యాసంగిలో నువ్వు పంట సాగు చేసుకుంటే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతానికి ఈ యాసంగిలో 5 వేల ఎకరాల వరకు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయాధికారుల అంచనా. యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పంట పూత దశకు చేరుకుంటే దిగుబడి తగ్గుతుందని, ప్రస్తుతం నువ్వు విత్తుకునేందుకు అనుకూల పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అందుకే 2025 లో యాసంగిలో నువ్వుల పంట (2025 sesame production) వెయ్యడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.
జగిత్యాల పంట రకాలు (jagtial farming data)
ఇప్పుడు జగిత్యాలలో నువ్వుల సాగు చేస్తున్న రైతులు జగిత్యాల తిల్-1 (జెసిఎస్-1020), శ్వేతి తిల్, చందన, హిమ రకాలు అనుకూలంగా ఉంటున్నాయని అంటున్నారు. అంతే కాకుండా పసుపు పంటను తవ్విన నేలల్లో సాగుచేస్తే దిగుబడి అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడైతే జిల్లాలో అధిక దిగుబడి వచ్చే జేసీఎస్ 1020 రకం సాగు ఊపందుకుంది అని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. ఈ రకం సాగుతో ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. గతంలో వ్యవసాయదారులు సాగుచేసే శ్వేత రకం ఎకరానికి కేవలం 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం వాడుతున్న జేసీఎల్- 1020 రకం వల్ల రెండింతల దిగుబడి వస్తుందని రైతులు ఆనంద పడుతున్నారు. అసలే జగిత్యాలలో ఎండుభూములు ఎక్కువగా ఉండటంతో, ఇలాంటి లాభకరమైన పంటలు (dryland profitable crops) వెయ్యడం ఎంతో అనువైనది. ఇలాంటి తక్కువ పెట్టుబడి పంటలతో (low investment crops India) ఎకరానికి 50 వేల నుండి లక్షరూపాయల వరకు చక్కగా సంపాయించవచ్చు.
మరింత తెలంగాణ వ్యవసాయ వార్తలు (Telangana agriculture news), తెలంగాణ పంట ఉత్పాదనల (Telangana crop highlights) గురించి తెలుసుకోవడానికి......
Read More:
Share your comments