News

పూర్తి తెలంగాణ వ్యవసాయ బడ్జెట్ ఇదే… రైతు భరోసాకి ఎంత?

Sandilya Sharma
Sandilya Sharma
  1. ముఖ్యాంశాలు:
    • 3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
    • వ్యవసాయ శాఖకి 24,439 కోట్ల బడ్జెట్
    • రైతుభరోసాకి 18 వేల కోట్ల కేటాయింపు
    • సన్నరకం బియ్యం బోనస్ కు 1,200 కోట్లు విడుదల
    • బిందుసేద్యం చేసేవారికి ప్రోత్సాహకాలు
    • వ్యవసాయ మార్కెట్ యార్డులకి 181.98 కోట్ల
    • పశుసంవర్ధక శాఖకి 1,674 కోట్ల బడ్జెట్
    • కంసాన్పల్లిలో 21 కోట్ల 6 లక్షల రూపాయలతో బుల్ స్టేషన్
    • మామిడిపల్లిలో 100 కోట్లతో పశువైద్య టీకా కేంద్రం
    • కోహెడలో 47 కోట్లతో చేపల మార్కెట్ 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 3,04,965 కోట్ల రూపాయలని వ్యవసాయశాఖకి కేటాయించనుందని రాష్ట్ర ఆర్ధిక ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభ బడ్జెట్ సమావేశంలో 2025-2026 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ ని ప్రవేశపెడుతూ వెల్లడించారు. 

ఈసారి వ్యవసాయ శాఖకి  24,439 కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించింది, ఇందులో ఎక్కువ భాగం ఎన్నికల హామీల, పథకాల అమలుకు ఉపయోగించనున్నారు.  

అలానే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి గాను  తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 18 వేల కోట్లు కేటాయించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు, మోసాలకు అడ్డుకట్ట వేసి సాగుకి యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందుతుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు.  ఇంకా, భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో ఆకలిబాధ పడకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఆర్థిక మంత్రి అన్నారు.

వానాకాలం సన్నరకం బియ్యానికి, క్వింటాలుపై 500 రూపాయిల అదనపు ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు. ఈ  బోనస్ అదనంగా ఇవ్వడానికి గాను 1,200 కోట్లు కేటాయింపు జరిగింది. గత ఖరీఫ్‌ కంటే సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క.

ఆయిల్ ఫామ్ రైతులకి, ఉద్యాన వన సాగు, బిందుసేద్యం చేసేవారికి ప్రోత్సాహకాలు అందిస్తాం అని, అలానే వీటికి తగ్గ ఆర్థికసాయం, యంత్రాలు కూడా అందచేస్తామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.  

వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి 181.98 కోట్ల నిధులను కేటాయించారు. మార్కెట్ యార్డుల్లో రైతులు పడుతున్న భాదలు తమ దాకా వచ్చాయని, ఇక ఈ యార్డుల్లో రైతుసమస్యలని తీర్చే భాద్యత మాదే అని హామీనిచ్చారు.   

ఈసారి బడ్జెట్ లో పశుసంవర్ధక శాఖకి 1,674 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది. తెలంగాణలో పాడి పరిశ్రమ ఎదుగుదదల కోసం ఎంతో కృషి చేశామని, అనేక కొత్త ప్రాజెక్టులు మొదలు అవ్వబోతున్నాయని, ఉపముఖ్యమంత్రి సెలవిచ్చారు. 

పశుసంవర్ధక శాఖ గురించి మాట్లాడుతూ, రాష్ట్రంలో మేలు జాతి పాడిపశువులను వృద్ధి చేయడానికి, రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో ఒక కొత్త  ఫ్రోజెన్ సెమెన్ బుల్ స్టేషన్ ని  21 కోట్ల 6 లక్షల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నామని, అతితొందరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం అని పేర్కొన్నారు. ఈ స్టేషన్ తో ఏడాదికి 10లక్షల ఫ్రోజెన్ సెమెన్ డోస్ లు ఉత్పత్తి చేసే సామర్థ్యం  పెరుగుతుంది అన్నారు.

హైదరాబాద్ శాంతినగర్ లో ఉన్న తెలంగాణ పశువైద్య టీకా కేంద్రాన్ని 300 వందల కోట్లతో రంగారెడ్డి జిల్లా, మామిడిపల్లికి విస్తరణ చేయబోతున్నట్లు వివరించారు. అధునాతన యంత్రాలు, టీకా కేంద్రాలు,బాక్టీరియా వైరస్ ప్రొటెక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్, ఆర్ అండ్ డి, యానిమల్ బ్రీడింగ్ సెంటర్, లతో పాటు స్టాఫ్ క్వార్టర్ లు కూడా నిర్మిస్తామని చెప్పారు. కొత్త వాక్సిన్ల పరిశోధన మరియు తయారీ కోసం అధునాతన యంత్రాల కోసం వంద కోట్ల బడ్జెట్ ను విక్రమార్క గారు ప్రతిపాదించారు.      

అలానే మత్సశాఖ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, తెలంగాణలో చేపల ఉత్పత్తి పెంచడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో, ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ హోల్ సేల్ చేపల మార్కెట్ ను 47 కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నట్లు, అలానే మత్స్యశాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

Share your comments

Subscribe Magazine

More on News

More