
2025-2026 ఆర్ధిక సంవత్సర వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శాసన సభ మండలి లో ప్రవేశపెట్టబోతుంది. శాసన సభలో ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. అలానే శాసనమండలిలో బడ్జెట్ ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు.
ప్రజాభావన్ లో నల్లపోచమ్మ ఆలయంలో పూజ చేసి, ప్రస్తుతం బడ్జెట్ పత్రులతో భట్టివిక్రమార్క శాసనసభకు చేరుకున్నారు. మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత తెలంగాణ 2025-2026 బడ్జెట్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈసారి రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షల కోట్లదాకా ఉంటుందని నిపుణుల అంచనా. ఇందులో వ్యవసాయా శాఖకు ఎంత కేటాయించనున్నారో ఇంకా తెలియాలిసి ఉంది.
ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశ పెట్టనున్నారు.
గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే హాజరు అయిన కేసీఆర్, ఇప్పటిదాకా బడ్జెట్ సమావేశాలకు దూరంగాఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా బడ్జెట్ ప్రవేశానికి కేసీఆర్ దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఈసారి వ్యవసాయ శాఖకి భారీగానే సొమ్ములు ముట్టనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాక ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా ఈరోజు బయటకి రావచ్చు. కానీ యువతకు ఈ బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు ఉండే ఛాన్స్. అలానే ఎన్నికల హామీల అమలుకు నిధులు కేటాయించే అవకాశం.
Share your comments