తెలంగాణలో వరి రైతులు ఏప్రిల్ నెలలో అకాల వర్షాల కారణంగా భారిగా పంటలు నష్ట పోయిన విషాదం మనకు తెలిసిందే. అయితే వీరికి చేయూతన ఇవ్వడానికి తెలంగాణ CM కే. చంద్రశేఖర్ రావు పంట నష్ట పరిహారం అందించాడని ఉతర్వులు జారీ చేసారు.
అకాల వడగళ్ల వానలకు తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ నెల అనగా మే 12వ తేది నుండి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. నష్ట పోయిన రైతులకు ఎకరాకు 10 వేళ రూపాయలు చెప్పున పరిహారం అందనుంది. ఏప్రిల్ నెల లో వర్షాల మూలంగా నష్ట పోయిన రైతుల వివరాలు సమాచారం, ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. ముఖ్య మంత్రి KCR నష్ట పరిహారాలను ఇవ్వడానికి మే 12 వ తేదీని ఖరారు చేసారు. ఆయా ప్రాంతాల MLAలు రైతు భాదితులకు ఎకరాకు 10 వెల చొప్పున చెక్ లను అందించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం లో ఒక్క వరంగలు జిల్లాలో 85,670 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇలా దాదాపు చాల జిల్లాల్లో రైతులు బాధితులు అయ్యారు . గతంలో వడగళ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులను ముఖ్య మంత్రి స్వయంగా సందర్శించి నష్టపరిహారం 85. 67 కోట్లు అందిస్తామని ప్రకటించారు. కానీ ఆ పరిహారం ఇంకా రైతుల వరకు చేరానేలేదని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఇది కూడా చదవండి
PM కిసాన్14వ విడత : దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు !
అందుకని ఇప్పుడు ముందుగా ఏప్రిల్ మొదటి వారంలో వానలకు నష్టపోయిన వరి రైతులకు మే 12 నుండి క్రమంగా పరిహారాలు అందిస్తాం అని ప్రభుత్వం ఖాయం చేసింది. తెలంగాణలో వరితో పాటు మొక్కజొన్న , అరటి, పల్లి , కూరగాయలు, పండించే మిగతా రైతులకు కూడా వనాల వళ్ళ నష్టం జరిగింది, కానీ వారికి నష్ట పరిహారం ఎప్పుడు ఇస్తారనే విషయం పై ఇంకా సమాచారం లేదు
ఇప్పుడైతే ఏప్రిల్ మొదటి వరం వడగళ్ల వానలకు నష్టపోయిన వరి రైతులకు ఎకరాలు 10 వేళ చొప్పున పరిహారం అందనుందని సమాచారం. మిగతా రైతులకు కూడా త్వరలోనే నష్ట పరిహారం అందాలని రైతు సంఘాలు ఆశిస్తున్నాయి.
ఇది కూడా చదవండి
Share your comments