తెలంగాణ లోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తగా, డియర్‌నెస్ డిఎ, మరియు డిఆర్ లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్‌ను పెంచడం కోసం జిఓ ఎంఎస్ 51 సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) 2. 73 శాతం అంటే మూల వేతనం లో 20.02 శాతం నుంచి 22.75 శాతానికి సవరించబడింది, ఇది జనవరి 1, 2022 నుంచి ఇది అమలులో లెక్కించబడుతుంది.
బకాయిలను తర్వాత విడుదల చేయనున్న ప్రభుత్వం.. జూన్ నెల వేతనం, పెన్షన్ తో పాటు పెరిగిన డీఏను జూలైలో ఉద్యోగులకు చెల్లించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డీఏ పెంపుతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లకు ప్రయోజనం కలగనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు.. ఏడాదికి రూ. 974.16 కోట్ల అదనపు భారం పడనుందని హరీశ్ రావు పేర్కొన్నారు. పెంచిన డీఏ ప్రకారం రూ.1,380 కోట్ల ఎరియర్స్ను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
అదే విధంగా జనవరి 1, 2022 నుండి బేసిక్ పెన్షన్‌లో 55.536 శాతం నుండి 59.196 శాతానికి పే స్కేల్స్ సవరించి , 2015లో పెన్షన్ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల DRని కూడా 2. 73 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆర్డర్‌లు ఆర్థిక సహాయ గ్రాంటీలు మరియు డియర్‌నెస్ రిలీఫ్‌కు అర్హత ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి . సవరించిన డియర్‌నెస్ రిలీఫ్ జూన్, 2023 పెన్షన్‌తో పాటు కలిపి, జూలై 2023లో చెల్లించబడుతుంది.
ఇది కూడా చదవండి
Share your comments