News

తడిసిన ధాన్యానికీ భరోసా – తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, రైతులకు ఊరట

Sandilya Sharma
Sandilya Sharma
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన 👉 కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు 👉 నష్టపోయిన రైతులకు వెంటనే సాయం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన 👉 కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు 👉 నష్టపోయిన రైతులకు వెంటనే సాయం

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరి ధాన్యం తడిసి ఆవేదన చెందుతున్న అన్నదాతలకు సహాయం చేయాలన్న సంకల్పంతో, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వమే సేకరిస్తుందని రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. వడగండ్ల వర్షాల వల్ల పంటలు నేలకొరిగాయి. ధాన్యం కోతకు వచ్చిన పంటలు చేల్లో తడిపోవడంతో పాటు, ఇప్పటికే కోత పూర్తయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. టార్పాలిన్లు లేకపోవడం, ధాన్యం నిల్వలను వెంటనే తరలించకపోవడం వల్ల ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, విలేకరులతో మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎలాంటి ఇబ్బంది లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ

ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి వెల్లడించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సేకరణగా ఉంటుందని పేర్కొన్నారు. 2023 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 25 లక్షల టన్నుల వరి మాత్రమే సేకరించింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల అనుసరిస్తున్న సానుకూల విధానాల వలన ఈసారి సేకరణ రెట్టింపు అయిందని అన్నారు.

రైతులకు ప్రభుత్వం భరోసా

రైతులకు మద్దతు ధర కల్పన, కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంపు, మౌలిక వసతుల మెరుగుదల, అధికారులు సమర్థంగా వ్యవహరించడం వంటి అంశాల వల్ల ఈ విజయాన్ని సాధించగలిగామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రభుత్వంగా, అన్నదాతలకు అండగా నిలబడటం మా బాధ్యత. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం జరుగేలా చూస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

రైతు సంఘాల డిమాండ్లు

ఇకపోతే, రైతు సంఘాలు మాత్రం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, నష్టపోయిన ధాన్యానికి ప్రత్యేక పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. వర్షాల వల్ల పంట పూర్తిగా నశించిపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

అకాల వర్షాలతో ఆందోళనలో ఉన్న తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిపిన ప్రభుత్వం, రైతుల పట్ల చూపుతున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని చెబుతున్నారు. ఇక రైతుల నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ హామీతో అన్నదాతలకు ధైర్యం వచ్చింది.

Read More:

Rythu Bharosa Update: నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, అప్పటిలోగా సబ్సిడీ జమ!

దేశ ఉత్పత్తిలో ఏపీదే 36% వాటా –అయినా అందని గిట్టుబాటు ధర!

Share your comments

Subscribe Magazine

More on News

More