హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఎగ్రోస్) తెలంగాణ రాష్ట్రంలో , మహిళల చే నడపబడే చిరుధాన్యాల స్టాల్ల్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
దీనికోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ మరియు IIMR లతో జతకట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా 50 మిల్లెట్ అవుట్‌లెట్లు:
దీనికోసం రాష్ట్రము లో విద్య ఉండికూడా ఎలాంటి వ్యాపార అవకాశాలు లేనటువంటి 100 మంది మహిళలను గుర్తించి, వారికి మిల్లెట్ వ్యాపారం చేయడానికి అవసమైన శిక్షణ ఇస్తున్నట్టు , TS -Agros డైరెక్టర్ కే రాములు తెలిపారు. ఈ మహిళలకు ఎలాంటి సురిటీ లేకుండా రుణాలు ఇవ్వడానికి కూడా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు సిద్ధంగా ఉన్నటు తెలిపారు.
ముందుగా హైదరాబాద్ లో 10 అవుట్ లెట్స్, మిగతా అన్ని జిల్లాలో 1-2 అవుట్లెట్స్ ఏర్పాటు చేయనున్నారు. సెలెక్ట్ చేసిన మహిళలకు ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది. మిల్లెట్ ప్రాసెసింగ్ ప్రక్రియ, వ్యాపారం మొదలగు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.
సెలెక్ట్ అయిన మహిళల్లో మొత్తం 90 మంది వ్యాపారానికి సిద్ధం గ ఉన్నారు. ఈ మిల్లెట్ అవుట్లెట్స్ లో బిస్కెట్స్ , చపాతీలు, ఇడ్లి ,,మొదలైన వాటితో కలిపి మొత్తం 63 రకాల మిల్లెట్ ఉత్పత్తులు ఉండబోతున్నాయి. అన్ని ఉత్పత్తులు వాటి నాణ్యతను నిర్ధారించడానికి FSSAI ప్రమాణపత్రాన్ని కలిగి ఉంటాయి. అక్షయ పాత్రా ఫౌండేషన్ నేరుగా చిరుధాన్యాలను రైతుల నుండి సేకరించబోతుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ రైతులకు లాభదాయకమైన ఆదాయాన్ని నిర్ధారించడానికి మార్కెట్‌లో మిల్లెట్‌కు డిమాండ్‌ను పెంచడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందడానికి ఇది ఒక వేదికను అందిస్తుంది.
అలాగే, TSAgros మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అసురక్షిత రుణాలను అందించనుంది . వారు ఒక దుకాణాన్ని కనుగొనలేకపోతే, TSAgros మరియు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి ప్రత్యేక కంటైనర్ దుకాణాలను అందించాలని భావిస్తున్నారు.
చిరుధాన్యాలు పండించేలా రైతులను ప్రోత్సహించడంతోపాటు ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి
Share your comments