News

తెలంగాణా రైతులకి భారీ శుభవార్త ! జూన్ నుండి ఇక మీ గ్రామానికే!!

Sandilya Sharma
Sandilya Sharma
Telangana farmers' new scheme 2025, June rural seed supply program (Image Courtesy: X @revanth_anumula)
Telangana farmers' new scheme 2025, June rural seed supply program (Image Courtesy: X @revanth_anumula)

తెలంగాణ రైతాంగానికి కీలకమైన శుభవార్త వెల్లడైంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అందించాలన్న మహత్తర లక్ష్యంతో రూపొందించిన "జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం" (Jayashankar agriculture university seed scheme) అనే నూతన కార్యక్రమాన్ని జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు (M Revanth Reddy agriculture initiatives). ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రకటించారు (Tummla Nageswara Rao announcement).

నూతన విత్తనాల పంపిణీ – గ్రామ స్థాయిలో రైతులకు ప్రోత్సాహం

ప్రతి గ్రామానికి నేరుగా నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఈ పథకం (Telangana quality seed distribution) రూపొందించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12,000 గ్రామాల్లో, ఒక్కో గ్రామంలో 3 నుంచి 5 మంది అభ్యుదయ రైతులను ఎంపిక చేసి వారికి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రాముఖ్యత గల విత్తనాలను పంపిణీ చేయనున్నారు. మొదటి దశలో 40 వేల మంది రైతులకు 2,500 నుంచి 3,000 క్వింటాళ్ల వరకూ వరి, కంది, పెసర, మినుము, జొన్న విత్తనాలను అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

గ్రామంలోనే విత్తన ఉత్పత్తి – నకిలీ విత్తనాలకు చెక్

ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన విత్తనాలను పొందిన రైతులు, పంట కోత తర్వాత వాటినే ఇతర రైతులకు తక్కువ ధరకు విక్రయించేందుకు ప్రోత్సహించడం. ఇలా చేయడం ద్వారా గ్రామంలో విత్తన స్వయం సంరక్షణ (Seed Self-Sufficiency) సాధించవచ్చు. తద్వారా నకిలీ విత్తనాల మోసాల నుండి రైతులను రక్షించడంతోపాటు 10-15 శాతం అదనపు దిగుబడిని పొందే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

విశ్వవిద్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్పత్తి

ఈ విత్తనాలు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఉత్పత్తి అవుతాయి. అన్ని నాణ్యత ప్రమాణాలను పూర్తి చేసినవి మాత్రమే పంపిణీకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిక్సూచి అవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, వ్యవసాయ సంచాలకుడు గోపి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కొత్త చర్య ద్వారా విత్తన ఉత్పత్తిలో తెలంగాణ ఒక ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Read More:

ఇవి ప్రతీ రైతుకి తెలియలిసిన పథకాలు! ఎండాకాలం తస్మాత్ జాగ్రత్త...

ప్రతీ చుక్కతో సేద్యం! PDMC కొత్త నిర్దేశకాలు

Share your comments

Subscribe Magazine

More on News

More