News

"రైతు మహోత్సవం ప్రారంభం: తెలంగాణలో వ్యవసాయ రంగానికి సరికొత్త ఊపిరి"

Sandilya Sharma
Sandilya Sharma
Telangana government schemes for farmers - Farmer training programs India - Sustainable agriculture events India
Telangana government schemes for farmers - Farmer training programs India - Sustainable agriculture events India

నిజామాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ‘రైతు మహోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది (Rythu Mahotsavam Telangana 2025). నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు ఈ మహోత్సవం జరుగనుంది.

ఈ వేడుకలను రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మరియు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లు కలిసి ప్రారంభించనున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ మహోత్సవం, రైతులకు సాంకేతిక పరిజ్ఞానం పరిచయం చేసి, తాజా వంగడాలు (New crop varieties in Telangana), యంత్రాలు, పరికరాలు (Agriculture machinery expo Telangana), వ్యాపార అవకాశాలు తెలియజేయడం ముఖ్య ఉద్దేశంగా ఉంది.

ఈ మహోత్సవానికి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి అభ్యుదయ రైతులు హాజరవుతారు. రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకోనున్నారు.

అభివృద్ధి ఆధారిత ప్రదర్శనలు (Telangana agriculture innovation programs)

 ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొని పలు అంశాలపై వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ 150 స్టాళ్లను ఏర్పాటు చేయగా, అందులో నూతన వంగడాలు, మెరుగైన విత్తనాలు, యాంత్రిక పరికరాలు, డ్రోన్ల వినియోగం వంటి అంశాలు ప్రదర్శించబడతాయి (Agriculture technology exhibition Telangana).

వైవిధ్యభరిత కార్యక్ర‌మాలు  (Telangana farmers festival highlights)

 రైతులు పండించిన వివిధ ఉత్పత్తులు, వాటి ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ అవకాశాలు, అలాగే డెయిరీ, పట్టు పరిశ్రమ, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాల లాభాలపై అధికారులు వివరాలు అందించనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు కూడా తమ పరిజ్ఞానాన్ని రైతులతో పంచుకుంటాయి.

సౌకర్యాల నిర్వహణ

రైతులకు అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. భోజనం, విశ్రాంతి ప్రదేశాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

 రైతు మహోత్సవం వ్యవసాయ రంగాన్ని మరింత శాస్త్రీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దే ప్రయత్నంగా నిలవనుంది. ఇది రైతులకు జ్ఞాన వేదికగా నిలిచే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ పేర్కొంది. రాష్ట్ర రైతాంగానికి ఈ మహోత్సవం ఒక పండుగలా మారనుంది.

Read More:

కడప జిల్లాలో గొర్రెలు, మేకల్లో ప్రబలుతున్న వ్యాధులు: రైతుల్లో ఆందోళన

భూభారతి ప్లాట్‌ఫామ్ ముఖ్యమైన ఫీజులు, వివరాలు ఇక్కడ

Share your comments

Subscribe Magazine

More on News

More