News

ముగిసిన తెలంగాణ తొలి విత్తన పండుగ: విత్తనం రైతు హక్కు అంటున్న కోదండ రెడ్డి

Sandilya Sharma
Sandilya Sharma
Kodanda Reddy speech..... indigenous seed sovereignty (Image Courtesy: Facebook, google Ai)
Kodanda Reddy speech..... indigenous seed sovereignty (Image Courtesy: Facebook, google Ai)

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం అన్మాస్‌పల్లి లోని ‘ది ఎర్త్ సెంటర్’ వేదికగా మూడు రోజులుగా జరిగిన తెలంగాణ తొలి విత్తన పండుగ (Telangana seed festival 2025) ఆదివారం ఘనంగా ముగిసింది. సీజీఆర్‌, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ (Bharat Beej Swaraj Manch)సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తో పాటు ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వ్యవసాయ, రైతుసంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ… "విత్తనం అన్నదాతకు బహుమతికాదు – హక్కు!" అని స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాల్లో విత్తనం మల్టీనేషనల్ కంపెనీల చేతిలోకి వెళ్లడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయని పేర్కొన్నారు. విత్తనం భద్రత లేకపోతే దేశానికి ఆహార భద్రతే ప్రమాదంలో పడుతుందన్నారు.

కోదండ రెడ్డి తన ప్రసంగంలో కల్తీ విత్తనాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు తిరిగి స్వయం ఆధారితంగా విత్తనాలు తయారు చేసుకునే రోజులు రావాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విత్తనం ప్రాముఖ్యతను వివరిస్తూ కమిషన్ సభ్యుడు కేబీఎన్ రెడ్డి మాట్లాడుతూ, "భూసారాన్ని కాపాడటమే రైతు భవిష్యత్తు రక్షణకు మూలం" అన్నారు. ప్రకృతి సాగు, జీవ ఆవరణ పరిరక్షణ (farmers natural farming rights) లాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించేలా పండుగ సాగిందని చెప్పారు.

ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, అన్మాస్‌పల్లి 'ఎర్త్ సెంటర్'ను (CGR Earth Center) దేశీయ విత్తన సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నారు. విత్తనం సాధికారత ఉద్యమం దేశవ్యాప్తంగా మరింత బలపడాలని ఆకాంక్షించారు.

ఈ పండుగ తెలంగాణ వ్యవసాయంలో (Telangana agriculture reforms) కొత్త అధ్యాయానికి నాంది పలికింది. జీఎంఓలకు (anti GMO farming India) వ్యతిరేకంగా, ప్రకృతి సాగుకు మద్దతుగా, రైతు సమృద్ధికి మార్గం వేసేలా సాగిన ఈ వేడుక – విత్తనం రైతు హక్కు (farmer seed rights India) అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రసారం చేసింది.

Read More:

తెలంగాణ రైతులకి సూచన! ఆ రోజు నుండి రైతు మహోత్సవాలు!!

ఆయిల్‌ పామ్‌ రైతులకు తీపి కబురు! కొత్త ధర ఎంత?

Share your comments

Subscribe Magazine

More on News

More