
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది. పంటల తర్వాత మిగిలే వ్యవసాయ వ్యర్థాలను వినియోగించుకునేలా, పర్యావరణహిత ఇంధనం ఉత్పత్తికి మార్గం సుగమం కానుంది. ఈ దిశగా జీపీఆర్ఎస్ ఆర్య సంస్థ కంప్రెస్డ్ బయోగ్యాస్ (GPRS Arya energy project) ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ప్రతిపాదనలు సమర్పించింది.
ఈ ప్రాజెక్ట్‌ను జీపీఆర్ఎస్ ఆర్య సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL)లతో 50:50 భాగస్వామ్యంతో అమలు చేయనుంది( IOCL BPCL biogas partnership). రాష్ట్రవ్యాప్తంగా 15 CBG ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ప్లాంట్ రోజుకు 15 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, మొత్తం 225 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉంది
ప్లాంట్లు ఏ జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయంటే (Telangana biogas plants 2025):
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి, వనపర్తి, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ప్రతి ప్లాంట్ ఏర్పాటుకు కనీసం 20 ఎకరాల స్థలం అవసరం కాగా, వరి గడ్డి, నాపియర్ గడ్డి నిల్వల కోసం అదనంగా మరో 25 ఎకరాలు అవసరం అవుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన 18 నెలల్లో ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్టు చెప్పారు.
ఉత్పత్తి మరియు లాభాలు (agricultural waste to energy India):
ఈ ప్రాజెక్టుల ద్వారా ఏటా సుమారు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి గడ్డి వినియోగించనున్నారు. దానితో 82,125 మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు (CBG plant capacity Telangana). ఇది సుమారు 57.84 లక్షల LPG సిలిండర్లకు సమానమని అంచనా. అంతేగాక 3 లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువు తయారవుతుంది. మట్టి నాణ్యత మెరుగుపడడంతో పాటు సేంద్రియ వ్యవసాయానికి కొత్త ఉత్సాహం లభించనుంది. మరోవైపు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో 17.24 లక్షల మెట్రిక్ టన్నుల తగ్గింపు సాధ్యమవుతుంది.
రైతులకు ఆదాయం, యువతకు ఉపాధి:
ప్రతి ప్లాంట్ ప్రాంతీయ గ్రామీణ యువతకు ఉపాధిని అందించనుంది. కనీసం 3,000 మంది స్థానిక యువత ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి పొందనున్నారు. వరి, పత్తి పంటల అవశేషాలను రైతులు కాల్చకుండా, జీపీఆర్ఎస్ సంస్థకు విక్రయిస్తే పర్యావరణానికి మేలు, రైతులకు ఆదాయం లభించనుంది.
మంత్రి తుమ్మల ఆశాభావం (Telangana green energy initiatives):
ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, "ఇది కేవలం ప్లాంట్ల వ్యవహారం కాదు, రైతుల భవిష్యత్తుకు మార్గం. పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని నివారించడమే కాకుండా, అవే రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. ఇది వాస్తవానికి గ్రీన్ ఎకానమీకి ఒక గొప్ప ఉదాహరణ" అని అన్నారు.
భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని మంత్రి తెలిపారు.
Read more:
Share your comments