News

ఏంటో ఈ విచిత్ర వాతావరణం! తెలంగాణలో మూడు రోజుల వర్షాలు, వడ గాలులు, IMD హెచ్చరిక జారీ

Sandilya Sharma
Sandilya Sharma
Telangana weather alert April 2025- heatwave warning Telangana, Telangana rain update IMD- Image Courtesy: Google Ai
Telangana weather alert April 2025- heatwave warning Telangana, Telangana rain update IMD- Image Courtesy: Google Ai

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల వేడి పొడి వాతావరణం ఏర్పడతాయని అంచనా వేస్తోంది. కేంద్ర వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరిక ప్రకారం, రైతులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • వర్ష సూచనలు: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • హీట్ వేవ్ హెచ్చరిక: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు నమోదు అయ్యే అవకాశం ఉన్నది (Khammam Bhadradri heat alert). ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి.
  • ఈదురు గాలులు, మెరుపులు: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురు గాలులు (Mulugu thunderstorms) మరియు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు (hailstorm forecast TG) కురిసే అవకాశం ఉంది.

రోజులవారి వాతావరణ సమాచారం:

ఏప్రిల్ 14 నుంచి 15 వరకు:

  • రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురుగాలులతో కూడిన ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్ని జీలాలో వేడి పరిస్థితులు కనిపించవచ్చునని హెచ్చరిక.

  • ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో (30-40 కిమీ వేగంతో) వడగండ్ల వానలు సంభవించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 15 నుండి 18 వరకు:

  • రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

  • హెచ్చరికలు లేవు, కానీ వర్షాభావ స్థితులు ఉండే అవాకాశంఉందని అధికారులు సూచిస్తున్నారు.
TS 3-day weather forecast, weather warning for farmers, Telangana- Image Courtesy: Google Ai
TS 3-day weather forecast, weather warning for farmers, Telangana- Image Courtesy: Google Ai

ఏప్రిల్ 18 నుండి 19 వరకు:

  • రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఎండగా ఉండే అవకాశం ఉంది.
  • వర్షాల అవకాశాలు లేకపోవడంతో సాగు పంటలకు నీటి కొరత ఉండే అవకాశముంది.

రాబోయే రోజుల వాతావరణ సమాచారం:

తేదీ

వాతావరణ స్థితి

హెచ్చరికలు

ఏప్రిల్ 15

కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

హెచ్చరికలు లేవు

ఏప్రిల్ 16

కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

హెచ్చరికలు లేవు

ఏప్రిల్ 17

కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

హెచ్చరికలు లేవు

ఏప్రిల్ 18

పొడి వాతావరణం

హెచ్చరికలు లేవు

ఏప్రిల్ 19

పొడి వాతావరణం

హెచ్చరికలు లేవు

రైతులకు సూచనలు:

  • వడగండ్ల వానల వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • వడ్ల, మామిడి, కూరగాయ పంటలపై కవరింగ్ చేయడం ద్వారా పంటలను రక్షించవచ్చు.

  • ఎండ తీవ్రత పెరుగుతున్నందున, పొలాల్లో నీటి నిల్వను పెంచే చర్యలు చేపట్టాలి.

రైతులు Meghdoot App, Mausam App, Damini Appల ద్వారా గ్రామస్థాయిలో వాతావరణ సమాచారం తెలుసుకోవచ్చు. ఇవి ఐఎండీ (IMD) అందించే అధిక ప్రామాణికత గల అప్లికేషన్లు.

వచ్చే నాలుగు రోజులు వర్షం, ఉష్ణోగ్రతల పెరుగుదల కలగలిసిన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరుతోంది.

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More:

తెలంగాణా రైతులకి భారీ శుభవార్త ! జూన్ నుండి ఇక మీ గ్రామానికే!!

పత్తి సేకరణలో తెలంగాణ అగ్రస్థానం… కేంద్ర గణాంకాల్లో తెలంగాణ ఘన విజయం!

Share your comments

Subscribe Magazine

More on News

More