
పెరుగుతున్న ఎండల కారణంగా పాడిపశువుల త్రాగునీరు, పోషణకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, అందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. పశువుల మేత కోసం ఉపాధిహామీ పథకం కింద 10,000 ఎకరాల్లో పచ్చగడ్డి, లేదంటే స్వయంగా భూమిని లీజుకి తీసుకొని, స్వయం సహాయ సంఘాల సభ్యుల ద్వారా పచ్చగడ్డి సాగు జరపాలి అని వెలగపూడి సచివాలయంలో, చంద్రబాబు అధికారులని నిర్దేశించారు.
మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు విషయాల గురించి అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా పాడిపశువుల ఆలనా పాలనా గురించి మాట్లాడుతూ, తాగునీటికి పశుగ్రాసానికి కొరత రాకూడదు అని, అందుకే ఉపాధిహామీ పథకం అనుసంధానంతో 10,000 ఎకరాల్లో పచ్చగడ్డి పెంపకం, స్వయంగా భూమిని లీజుకి తీసుకొని, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చగడ్డి సాగు జరపాలి అని అధికారులతో అన్నారు.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, మార్చిలో పోయిన ఏడాది కంటే ఇప్పటికే ఎక్కువ వేడి నమోదు అయ్యిందని, కానీ ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పాడి పశువుల మీద పడ కూడదు అని, ఈ సందర్భంగా నాయుడు గారు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చగడ్డి కొరత ఉందని, కేవలం 4.7 లక్షల మెట్రిక్ టన్నుల పచ్చిమేత మాత్రమే అందుబాటులో ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులతో అన్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఎండు గడ్డిని అందిచగలమని, రాష్ట్రంలో 13.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎండుగడ్డి అందుబాటులోఉండని ఆయన వివరించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పశువుల మీద దాని ప్రభావం గురించి మాట్లాడుతూ, పెరుగుతున్న వేడి వల్ల నీటి కొరత రావచ్చని, అయితే అందుకోసమే 9,044 నీటి తొట్లని కట్టించామని, ఇంకో 12,138 నీటి తోట్లు మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తాయని అన్నారు.
Share your comments