News

Trump tariff 2025: భారత వ్యవసాయ మార్కెట్‌కి సవాళ్లు ఎదురవుతాయా?

Sandilya Sharma
Sandilya Sharma
Trump presidency economy (Image Courtesy: Google Ai, Instagram)
Trump presidency economy (Image Courtesy: Google Ai, Instagram)

అధికారంలోకి వచ్చి రాగానే అమెరికా అధ్యక్షుడు ప్రపంచంతో ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఒక దాని తర్వాత ఒకటి, వైట్ హౌస్ నుండి పిడుగుపాట్లలాంటి నిర్దేశకాలని వదలడంతో మార్కెట్ అతలాకుతలం అవుతుంది. తాజాగా ట్రంప్ తెచ్చిన కొత్త సుంకాలతో, గత రెండురోజులుగా అమెరికా సొంత స్టాక్ మార్కెట్ (US market crash) కుప్ప కూలిపోయింది. 2020 తర్వాత ఇంత దారుణమైన స్థితిలో స్టాక్ మార్కెట్(stock market 2025) పడటం ఇదే మొదటిసారి అని వాళ్ళ నిపుణులే వాపోతున్నారు. 

ట్రంప్ ఆర్ధిక విధానాలు (Trump economic policy); భారత్ తో వాణిజ్య యుద్ధం (trade war India US)

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త రిసిప్రోకల్ టారిఫ్ (Reciprocal Tariff Act) విధానంతో భారత వ్యవసాయ ఉత్పత్తులపై 26 శాతం దిగుమతి పన్నులు విధించబోతున్నారు.  డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వాణిజ్య విధానాలు (Donald Trump trade policy), ఇప్పుడు అమలు అవుతూవుండటంతో భారత్ వ్యవసాయ ఎగుమతులపై (Indian agriculture exports) ప్రభావం చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా ఇప్పటికే కొన్ని భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై (tariff on Indian goods), ముఖ్యంగా బియ్యం, చెరకు, మిర్చి, ఆవాలు, మరియు నూనెపై అధిక దిగుమతి సుంకాలను విధించింది. దీనివల్ల అమెరికాలోకి భారత వ్యవసాయ ఎగుమతులు (Indian agriculture exports) తగ్గే అవకాశముంది.

అయితే, ఈ మార్పులు భారత వ్యవసాయ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపవని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వీరి అభిప్రాయం ప్రకారం, సరైన వాణిజ్య చర్చల ద్వారా భారత్ గట్టి లాభాలు పొందవచ్చు.

అమెరికా వర్తక కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ విమర్శించినట్లు, భారత్‌ ఇప్పటికీ అమెరికన్ మొక్కజొన్నను కూడా దిగుమతి చేసుకోవడంలేదు. ట్రంప్ భారత్‌ను "టారిఫ్ కింగ్"గా విమర్శించగా, భారత అధికారులు చిన్న రైతుల జీవనోపాధిని రక్షించడమే తమ ప్రాధాన్యతని చెబుతున్నారు. ఇండియా వ్యవసాయ రంగంలో ఇంకా ఉత్పాదకత తక్కువగా ఉండటం, చిన్న భూక్షేత్రాలు ఉండటం వంటి మౌలిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ధరల ఒత్తిడులు, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి సవాళ్లుగా (impact on Indian farmers) మారుతున్నాయి. అమెరికా రైతులు పెద్దపెద్ద భూముల్లో వాణిజ్య వ్యవసాయం చేస్తే, భారత్‌లో ఎక్కువ మంది రైతులు పదిసెంట్లు నుండి ఎకరం లోపల భూములకే పరిమితమై ఉండడం గమనార్హం.

US import tax on rice, jaggery, mustard (Image Courtesy: Google Ai)
US import tax on rice, jaggery, mustard (Image Courtesy: Google Ai)

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణపై నేరుగా ప్రభావం

ఈ రెండు రాష్ట్రాలు బియ్యం, మిర్చి, చెరకు, చేపలు వంటి ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రముఖంగా ఉన్నందున, ట్రంప్ టారిఫ్ ప్రభావం నేరుగా పరిశ్రమలపై పడనుంది. పత్తి మరియు చేనేత పరికరాల ఎగుమతులపై ఇప్పటికే డిమాండ్ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

తెలంగాణలోని నారాయణపేట, గద్వాల్, నల్లగొండ ప్రాంతాల్లో, రైతులు ఇప్పటికే రాయితీలు లేకుండా సాగుచేస్తుండగా, టారిఫ్ ప్రభావంతో మరింత నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలు, గుంటూరు, తెనాలి, విజయవాడలో  అమెరికా మార్కెట్‌ మీద ఆధారపడి ఉంటాయి. ఎగుమతులు (rice exports) తగ్గిపోవడం వల్ల స్థానిక పరిశ్రమలు ఎదురుదెబ్బకు గురవుతున్నాయి.

భారత ప్రభుత్వం స్పందన అవసరం

నిపుణుల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం అమెరికాతో బిలాటరల్ ట్రేడ్ ఒప్పందాల దిశగా చురుకుగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. భారత వ్యవసాయ రంగాన్ని టారిఫ్ ప్రభావాల నుండి రక్షించేందుకు WTO స్థాయిలో న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

అదనంగా, దేశీయ వ్యవసాయ మద్దతు ధరలు (MSP), నిల్వ గదుల ప్రణాళికలు, ఎగుమతులకు ప్రత్యామ్నాయ గమ్యస్థలాల అభివృద్ధి వంటి చర్యలు తీసుకోవాలి.

అంతర్జాతీయంగా చైనా, వియత్నాం వంటి దేశాలకు లాభదాయక పరిణామం

అమెరికా తానే స్వయం సమృద్ధిగా మారేందుకు ఇతర దేశాల ఎగుమతులపై నియంత్రణలు పెడుతూ, చైనా, బ్రెజిల్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. భారత్ ఈ పోటీకి సిద్ధంగా ఉండాలి.

ట్రంప్ విధించిన టారిఫ్‌లు (US tariffs India) ఇతర పోటీ దేశాలపై ఎక్కువగా ఉండటం వల్ల భారత ఎగుమతిదారులకు సాపేక్షంగా లాభమే ఉన్నట్టు చెబుతున్నారు. ఉదాహరణకు చైనాపై 34%, వియత్నామ్‌పై 46%, థాయిలాండ్‌పై 36% టారిఫ్‌లు ఉండడం భారత రైస్ ఎగుమతులకు అనుకూలంగా మారొచ్చని  ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఇండియా-అమెరికా మధ్య వ్యవసాయ వ్యాపారం పరిమితంగా ఉండడం, భారత మద్దతు ధరల విధానం, చిన్న రైతుల ఆధారిత వ్యవసాయ వ్యవస్థ వంటి కారణాలతో భారత్‌ ఇప్పట్లో పెద్ద నష్టానికి గురికాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌ అమెరికాకు రైస్‌, ష్రిమ్ప్స్‌, తేనె వంటి ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది.

మొత్తంగా ట్రంప్ టారిఫ్ భారత వ్యవసాయ రంగానికి "ఘోర నష్టం" కలిగించదని, కానీ తెలివిగా, వ్యూహాత్మక చర్చలు ప్రభుత్వాల మధ్య జరగాలి.

Read More: 

Bird Flu Alert: ఆంధ్రాలో బాలిక మృతి తర్వాత తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం – వివరాలు ఇవే

ఈ మూడు పంటలకు ఇండియానే మార్కెట్, అమెరికాతో పొత్తు….

Share your comments

Subscribe Magazine

More on News

More