కరోనా లాక్డౌన్ సమయం నుండి కాష్ వాడకం చాలా మటుకు తగ్గిపోయింది. కూరగాయల నుండి హోటల్ బిల్లులు వరకు ఎక్కడైనా ఆన్లైన్ పేమెంట్స్ ఏ నడుస్తున్నాయి. దీనితో ప్రజలు ఇదివరకు లాగా బయటకి వెళ్లే ముందు జేబులో డబ్బులు ఉన్నాయో లేదో వెతుక్కునే పని లేకుండా ఫోన్ ఉంటె చాలు అనుకుంటున్నారు.
చాల వరకు ప్రభుత్వ లావాదేవీలు అంటే పన్ను చెల్లింపు, కర్రెంట్ బిల్లు వంటివన్నీ ఆన్లైన్ లోనే చెల్లించే అవకాసం ఉంది. ప్రయాణాలలో కూడా దూరం ప్రయాణం చేసే బస్సుల్లో ఇప్పటికే ఆన్లైన్ పేమెంట్ లు తీసుకుంటున్నారు. అయితే త్వరలోనే TSRTC
లో సిటీ బస్సుల్లో కూడా ఆన్లైన్ లో కాష్ లెస్ లావాదేవీలతో , టికెట్ తీసుకునే సదుపాయం రానుందని సమాచారం.దీని ద్వారా సమయం సేవ్ అవుతుంది. చిల్లర గొడవ ఉండదు.
ఈ సంవత్సరం చివరికల్లా సిటీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత సంవత్సరం నుంచే నగదు రహిత లావాదేవీలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఫోన్ పే క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే అవకాశం అధికారులు కల్పించారు. ఇదే విధంగా సిటీ బస్సుల్లో కూడా అమలులోకి తీవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక అందరు క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌కే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా క్యాష్‌లెస్ సేవలను అందిస్తున్నాయి. రవాణా రంగంలో కూడా యూపీఐ సేవలను తీసుకొచ్చారు. నిత్యం గ్రేటర్ హైదరాబాద్‌లో నడిచే సిటీ లోకల్ బస్సుల్లో కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ త్వరలోనే అమలులోకి తేనున్నారు.ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.కాబట్టి ఇకపై చిల్లర కోసం వెతుక్కునే పనిలేకుండా చక్కగా బస్సులలో ప్రయాణం చేయవచ్చు.
ఇది కూడా చదవండి
Share your comments