భారత టెలికాం ఇండస్ట్రీ లో అనూహ్య మార్పులు జరగడం కోతేమి కాదు, ఒకప్పుడు 11 టెలికం బ్రాండ్లు ఉంటే, ఇప్పుడు 3 ప్రముఖ బ్రాండ్లు మాత్రమే రాజ్యం ఏలుతున్నాయి. వోడాఫోన్ ఐడియా మాత్రం తన మార్కెట్ షేర్ ను భారీ గ పోగొట్టుకుంది.
ఫిబ్రవరి నెలలో వోడాఫోన్ ఐడియా 20 లక్షల కస్టమర్లను కోల్పోయినట్టు టెలిఫోన్ నియంత్రణ సంస్థ , ట్రాయ్ గణాంకాలను విడుదల చేసింది. అయితే జియో మరియు ఎయిర్టెల్ రేస్ లో ముందున్నాయి. జియో తమ ఖాతా లో 10 లక్షల సుబ్స్క్రైబ్ర్లను చేస్చుకుంటే, ఎయిర్టెల్ 982,554 సుబ్స్క్రైబ్ర్లను చేర్చుకుంది.
ఇది కూడా చదవండి
హై అలెర్ట్.. ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దు.. చాలా డేంజర్
వోడాఫోన్ ఐడియా ఇంకా తమ 5G లాంచ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం తో వరుసగా 23 నెలల నుండి సుబ్స్క్రైబ్ర్ల సంఖ్యా తగ్గుముఖం పట్టింది. జిఓ ఎయిర్టెల్ తమ అప్డేటెడ్ 5G లాంచ్ లతో, మార్కెట్ లోని పెద్ద మొత్తం ఆకట్టుకున్నారు. ఇక సుబ్స్క్రైబ్ర్ల పరంగా జియో 37. 41 జాతం వాటా కలిగి ఉండగా, ఎయిర్టెల్ 32. 39 శాతం వాటా తో రెండవ స్థానం లో ఉంది. వోడాఫోన్ ఇప్పుడు 20.84 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.
టెలికాం విభాగం లో వోడాఫోన్ వెనుకబడి ఉండడం వల్లే ఈ నష్టం జరుగుతుంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికీ ఈ కంపెనీకి, 2.2 లక్షల కోట్లు అప్పు ఉండగా,AGR బకాయిల కింది దాదాపు 16 వేళ కోట్లు ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకుంది, అయినప్పటికీ జియో ఎయిర్టెల్ లతో , పోటీ పడలేక పోతుంది. ముందు ముందు BSNL తమ 5g లాంచ్ చేయనున్నట్టు సమాచారం కనుక, వోడాఫోన్ ఐడియా ని ధాటి BSNL ముందుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి
హై అలెర్ట్.. ఈ నంబర్స్ నుండి కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దు.. చాలా డేంజర్
Share your comments