TSDPS ఈరోజు విడుదల చేసిన వాతావరణ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రము లోని పళ్ళు జిల్లాల్లో తదుపరి మూడు రోజుల్లో వర్షపాతం నమోదవ్వనుందని అంచనా.
జూన్ నెలాఖరు చేరుకున్న ఇంకా వర్షాల జాడ కనపడక ప్రజలు వేడి తో అల్లాడుతున్నారు. రైతులు చిరుజల్లులు కోసం ఉత్కంఠ గ ఎదురుచూస్తున్నారు. ఎపి లో రాయలసీమలో నిలిచిపోయిన రుతుపవనాలు మిగతా తెలుగు రాష్ట్రాల జిల్లాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర వర్షపాత రిపోర్ట్ ప్రకారం , రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం/ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. GHMC ప్రాంతం లో కొన్ని ఏరియా ల వద్ద ఈరోజు సాయంత్రం/రాత్రి వరకు తేలికపాటి వర్షం నుండి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత, రాబోయే రెండు రోజులు పొడి వాతావరణం ఉండవచ్చు.
ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే, రాష్ట్రము లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 43 డిగ్రీల పరిధిలో ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల నుండి 29 డిగ్రీల మధ్య ఉండవచ్చని హైదరాబాద్ వాతావరణ సఖ అంచనా వేస్తుంది.
GHMC ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37- 39 డిగ్రీల పరిధిలో ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 27- 29 డిగ్రీల పరిధిలో ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి
రైతులకు శుభవార్త :జూన్ 26 నుంచి రైతుబంధు ..అధికారులను ఆదేశించిన కెసిఆర్
Share your comments