News

"రైతులే దేశానికి సంరక్షకులు": పశ్చిమ బెంగాల్ గవర్నర్

Sriya Patnala
Sriya Patnala
West Bengal Governor Dr. CV Ananda Bose at Krishi Jagaran
West Bengal Governor Dr. CV Ananda Bose at Krishi Jagaran

న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ అధికారి, మలయాళీ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సివి ఆనంద బోస్ కృషి జాగరణ్‌ను సందర్శించారు. ఆయనకు కృషి జాగరణ్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ఎంసీ డొమినిక్ స్వాగతం పలికారు.

గవర్నర్ మాటలు

కోవిడ్ మహమ్మారి సమయంలో రైతులు మాత్రమే ఈ దేశాన్ని కాపాడారు. ఎందుకంటే వ్యవసాయం దైవ కార్యకలాపం. వ్యవసాయం మనకు ఏది కావాలంటే అది అందించగలదు. ప్రకృతి మనకి మంచి గురువు . నమ్మిన వారికి ప్రకృతి ఎప్పుడూ ద్రోహం చేయదు.
-డా. సివి ఆనంద బోస్

అయన కేరళ లోని కొట్టాయం స్థానికుడు . వీరు 23 నవంబర్ 2022న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసారు . అంతకు ముందు, భారత ప్రభుత్వం. యూనివర్శిటీలో సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద బోస్ కేరళలోని పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. NAFED MD, కొబ్బరి అభివృద్ధి బోర్డు చైర్మన్, సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, రైల్ సైడ్ వేర్‌హౌసింగ్ కంపెనీ చైర్మన్, నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్ (NMI) వైస్ ఛాన్సలర్, సెంట్రల్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ వంటి అనేక పదవులను కూడా ఆయన నిర్వహించారు.

ఆయన నిర్మితి కేంద్రానికి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అమలు చేసిన తక్కువ-ధర గృహ నిర్మాణ వ్యవస్థను ఆనంద బోస్ మోడల్ అని పిలుస్తారు , ఇది చాలా మంది మహనీయుల దృష్టిని ఆకర్శించింది.

రచయిత గా Dr. బోస్

ఈయన ఇంగ్లీష్, మలయాళం మరియు హిందీ భాషలలో మొత్తం 32 పుస్తకాలు మరియు వ్యాసాలు రచించారు.

గవర్నర్ రాక తో కృషి జాగరణ్ సంస్థ స్థాపకులు, యాజమాన్యం వారికి సాదర ఆహ్వానం పలికి, వారి ఆదర్శాలు , అనుభవాల నుండి ఎన్నో విషయాల పై జ్ఞానం పంచుకున్నారు.

Share your comments

Subscribe Magazine

More on News

More