అవసరం ఆలోచనగా మారితే, ఆలోచనను ఆచరణలో పెడితె, ఎలాంటి ఫలితాలు వస్తాయో, తక్కువ భూమిలో ఎక్కువ పంటను తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఎలా సొంతం చేసుకోవాలో పాత పద్ధతులకు కొత్త ఆలోచనలను జోడించి వ్యవసాయాన్ని కొత్త కోణంలో నుండి పరిశీలించి, లాభదాయకమైన పంటలను ఎలా పండించుకోవాలో తెలుపుతున్నారు.. దొడ్లబల్ల జిల్లా, తీహాళ్ళకు చెందిన హ్ చ్ .సదానందం అనే రైతు. కేవలం 2.10 ఎకరాల భూమి నుండి సంవత్సరానికి 22 లక్షలు సంపాదిస్తున్నాడు.
నిరంతరం ప్రయోగాత్మక ఆలోచనా పద్ధతులతో తన వ్యవసాయ క్షేత్రంలో బహుళ పంటలను పండిస్తూ అధిక సంపదను సృష్టిస్తున్నాడు. కవితకు ఏదీ కాదు అనర్హం అన్నట్టు.. తన వ్యవసాయ భూమిలో ఏ ఒక్క భాగం కూడా ఖాళీగా ఉంచకుండా 31 రకాల పంటలను సాగు చేస్తున్నాడు.ఇందులో ముఖ్యంగా టమాటో, పోక చెట్లను ఎక్కువ భాగంలో వేసాడు. దీనితోపాటు అల్లంను కూడా సాగుచేస్తున్నాడు. దీని ద్వారా సంవత్సరానికి అతనికి 70వేలదాకా ఆదాయం వస్తుంది. అతని వ్యవసాయ క్షేత్రంలో చిన్న చేపల కొలను, కూరగాయల తోట కూడా ఉన్నాయి. ఏ మొక్కల వ్యర్థాలను వృధాగా పోనీయకుండా వ్యవసాయాన్ని చేస్తున్నాడు. వీటితోపాటు అతడు పాడి వ్యవస్థను కూడా నమ్ముకున్నాడు.ఈ రైతు పెంచుతున్న ఆవులు రోజుకు 80 -100 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఎరువులను, ఇతడు ఆవుల పేడ నుండి గోబర్ గ్యాస్ ను కూడ తయారుచేస్తున్నాడు.
అంతేకాకుండా, అతని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఓ చిన్న చెరువు అజోరా మొక్కలతో నిండిఉంది. దీనిని ఆవులకు మంచి ఆహారంగా ఉపయోగిస్తున్నాడు. నీటి పారుదల కోసం బోరు నీటి పై ఆధారపడిన ఈ రైతు తన మొత్తం భూమికి బిందు సేద్యాన్ని ఏర్పాటు చేసి,ప్రభుత్వం నుంచి 50 వేల రూపాయల రాయితీ కూడా పొందుతున్నాడు. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ ను 4:00గంటల పాటు 3ఫేస్ కరెంట్ తో నడిపిస్తున్నాడు. కేంద్ర వ్యవసాయ వ్యవసాయ శాఖ అందించే ప్రతిష్ట మైన అవార్డును కూడా అందుకున్నాడు ఇతర దేశాల నుండి కూడా ఇతని వ్యవసాయ పద్ధతులను పరిశోధనలు చేయడానికి వ్యవసాయ పరిశోధకులు తరలివస్తున్నారు.
వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడమే కాకుండా ఆ రైతు తన వ్యవసాయ భూమిలో 250 గిరిజా కోళ్లను కూడా పెంచుతున్నాడు వీటిని ప్రతి మూడు నెలలకు ఒకసారి విక్రయించి వీటి ద్వారా సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంకా పౌల్ట్రీ వ్యర్థాలు పోకచెక్క లకు ఓ విలువైన ఎరువుగా ఉపయోగిస్తున్నాడు ఇలా దీనిని కూడా వృధా చేయకుండా ఆరోగ్య కరమైన వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ మంచి లాభాలను పొందుతున్నాడు అంతేకాకుండా ప్రకృతికే అందాల నిచ్చే రెండువేల గులాబీ మొక్కలను నాటాడు దీని ద్వారా అతనికి సంవత్సరానికి నాలుగు లక్షల ఆదాయం వస్తుంది క్యాప్సికం కాఫీ మొక్కలు బత్తాయి నిమ్మ సపోటా మొదలైన వాటిని పెంచి లాభాలను వ్యవసాయ రంగంలో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు
Share your comments