మన భారతీయ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఈ విధంగా ఆయుర్వేదంలో ఉపయోగించే వాటిలో శ్రీగంధం ఒకటి. శ్రీ గంధం మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగరబత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్ లలో ఎంత విరివిగా ఉపయోగిస్తారు. ఎంతో ప్రాధాన్యత గల శ్రీ గంధం మొక్కలను ఎలా ఎంపిక చేసుకోవాలి. ఈ మొక్కలను సాగు చేయడానికి అనుకూలమైన నేలలు ఏమిటో తెలుసుకుందాం..
ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న శ్రీ గంధం మొక్కలు నాటడానికి సారవంతమైన సేంద్రియ పదార్థాలు కలిగినటువంటి అన్ని నేలలు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు. నీరు నిలువని ఒండ్రు నేలలు, ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు పెంచవచ్చు. ఈ మొక్కలను సాగు చేయడానికి భూమి యొక్క ph 6.5 నుంచి 7.5 మధ్య ఉండే నేలలు ఎంతో అనుకూలమైనది. శ్రీ గంధం సాగు చేయాలంటే మురుగునీరు పారుదల తప్పనిసరిగా ఉండాలి. ఈ విధమైనటువంటి అనుకూలతలు కలిగిన నేలల్లో శ్రీగంధం సాగు చేయడం వల్ల అధిక లాభాలను పొందవచ్చు.
శ్రీ గంధం మొక్కలను సాగుచేసే రైతులు మొక్కల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు మెళుకువలను పాటించాల్సి ఉంటుంది.ఈ మొక్కలు ఏళ్ళతరబడి ఉంటాయి కనుక ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. శ్రీ గంధం మొక్కలు నర్సరీలలోనే ఏడు నుంచి ఎనిమిది నెలలపాటు తిరిగి సుమారుగా 35 సెంటి మీటర్ల ఎత్తు పెరిగిన మొక్కలు ఎంతో అనుకూలం. ఈ విధంగా మంచి గుర్తింపు పొందిన నర్సరీలలో పెరిగిన మొక్కలను ఎంపిక చేసి నాటడం వల్ల రైతులు అధిక లాభాలను పొందవచ్చు.
Share your comments