కూరగాయ పంటల్లో ఎంతో ముఖ్యమైనది టమాట. దానికంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న కూరగాయ ఇది. పొలంలో పండించినా ఇంటి తోటలో పెంచినా దీన్ని పండించేందుకు చక్కటి స్కిల్ ఉండాల్సిందే.
కొన్ని రకాల పద్ధతులు పాటిస్తే చాలు.. ఎక్కడైనా టమాట సాగు సులభం అవుతుంది. సాధారణంగా ఇవి ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే పెరుగుతాయి. అందుకే మన దేశంలోని వాతావరణం వీటికి చక్కగా నప్పుతుంది. పెద్దగా ఎరువుల వంటివి ఏవీ అందించకపోయినా పండే పంట టమాట. అదే ఎరువులు కూడా అందిస్తే దిగుబడి మరింత అధికంగా వస్తుంది. అందుకే టమాట పంట వేసే ముందు కొన్ని చిన్న చిన్న పద్ధతులు, చిట్కాలు తెలుసుకోవాలి. పంట వేసే సమయంలో వాటిని పాటించాలి. అప్పుడే ఎర్రెర్రని టొమాటో పంట మీ సొంతం అవుతుంది. అందుకే టమాట పంట వేసేందుకు ఈ చిట్కాలను పాటించండి.
ఎక్కువ స్థలం
టమాట మొక్క చాలా ఎత్తుగా పెరుగుతుంది. దానికి మనం సరైన ఆధారాన్ని అందిస్తే వర్టికల్ గా పండుతుంది లేకపోతే గుబురుగా ఎక్కువ కొమ్మలతో ఎదుగుతుంది. అందుకే రెండు మొక్కల మధ్య వీలైనంత దూరాన్ని ఉంచాలి. కనీసం ఒకటిన్నర నుంచి రెండు గజాల దూరాన్ని ఉంచితే మంచిది. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. రెండు మొక్కలను దూరంగా ఉంచకపోతే కాయలు కోసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు.. దగ్గరగా మొక్కలు నాటడం వల్ల వాటి ఎదుగుదలలో కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ఫలితంగా తక్కువ పంట చేతికి అందుతుంది. ఇంట్లో పెంచుకోవాలంటే పెద్ద పొడవాటి కుండీలు తీసుకొని ఒక కుండీలో కేవలం రెండు మొక్కలను మాత్రమే నాటుకోవాలి. అటు ఇటు చివర్లలో వీటిని నాటుకొని కావాలంటే కొత్తిమీర వంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఎక్కువ ఎత్తుకు ఎదగవు కాబట్టి వీటి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నీళ్లు ఎంతో ముఖ్యం
టమాట పంటలో దిగుబడి బాగా రావాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉన్న నేలల్లో వాటిని నాటుకోవాలి. కింద మొత్తం మట్టి నింపి వాటిపై ఒక లేయర్ కంపోస్ట్ నింపి మళ్లీ మట్టి పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాయలు పొందే వీలుంటుంది. అంతేకాదు.. స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్స్ దీనికి చేర్చుకోవాల్సి ఉంటుంది. తగిన మొత్తంలో కంపోస్ట్ వాడడం వల్ల మొక్కకు తగిన వేడి కూడా తగిలి కాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఎండ కూడా అవసరమే..
రోజులో కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు ఎండ తగిగేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల టమాటల రంగు, రుచి అద్భుతంగా మారడంతో పాటు వేళ్లు, కొమ్మలు కూడా బాగా పెరుగుతాయి. రోజూ సాయంత్రాల్లో కాసేపు ఈ మొక్కలను ప్లాస్టిక్ షీట్ కప్పి ఉంచడం వల్ల ఇది నేలను వేడిగా మార్చి వేళ్లు ఎక్కువగా లోతుగా వెళ్లేందుకు సాయపడుతుంది. అంతేకాదు.. టమాటలు కూడా ఆరోగ్యంగా పెరిగే వీలుంటుంది.
ఎక్కువ నీరు అందిస్తే..
మిగిలినవి ఏవి ఉన్నా లేకపోయినా టమాట పంట పండించేందుకు ఎక్కువ నీళ్లు ఉండాల్సిందే. ఇవి చాలా ఎక్కువ నీటిని తీసుకుంటాయి. అందుకే నీళ్లు తక్కువగా ఉన్న చోట్ల వీటిని పెంచే వీలు తక్కువగా ఉంటుంది. రోజూ కనీసం రెండు సార్లు వీటికి నీటిని అందించాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీళ్లు అందిస్తే ఇంకా మంచిది. నీళ్లు ఎక్కువగా అవసరం అన్నాం కదా మరీ ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదు. అలాగే ఎక్కువగా ఉన్న నీరు బయటకు వెళ్లే అవకాశం ఉండేలా చూసుకోవాలి.
ఆధారం తప్పనిసరి..
టమాట మొక్కలు కొంత ఎత్తు పెరిగాక వాటిని కర్రలకు కట్టి పైకి కట్టి ఉంచాలి. వాటికి పైకి పెరిగేందుకు ఆధారం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కాయలు నేలకు తగిలి పాడయ్యే ప్రమాదం ఉండదు. అయితే ఇవి పెట్టేందుకు సరైన సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మరీ ముందు పెడితే మొక్క సరిగ్గా ఎదగదు.
టొమాటోలు కాస్త నీళ్లు అందిస్తే చాలు.. ఎక్కడైనా పెరుగుతాయి. వాటిని కాస్త కాపాడుకుంటే సరిపోతుంది.
https://krishijagran.com/agripedia/your-guide-to-tomato-cultivation-management/
https://krishijagran.com/agripedia/go-for-smart-farming-for-a-tomato-revolution/
Share your comments