మార్కెట్లలో ప్రత్తి ధర గత కొన్ని సంవత్సరాలుగా 6 వేల నుంచి 8 వెల వరకు మాత్రమే కొనసాగుతుంది .. ఈ ఏడాది ప్రారంభంలో 10 వేల వరకు ధర పలికిన ప్రత్తి ఇప్పుడు కొన్ని మార్కెట్లలో అయితే రూ . 6900 నుంచి గరిష్టముగా రూ . 8000 వేలు వరకు ధర పలుకుతుంది .
పంటకు గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు రోడ్డెక్కారు. రోజురోజుకు పడిపోతున్న పత్తి ధరలు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. రైతు హక్కుల పోరాట సమితి (ఆరెచ్పీఎస్) పిలుపు మేరకు ఆసిఫాబాద్ నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి.. అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. పత్తి పంటకు క్వింటాలుకు రూ. 15 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎండు కొబ్బరికి MSP మద్దతు ధరకు కేంద్రం ఆమోదం !
అనంతరం ఇదే అంశంపై కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహిం చారు. అడిషనల్ కలెక్టర్ రాజేశం, సీసీఐ, జిన్నింగ్ మిల్లు యజమానులు, రైతు సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొని చర్చించారు. మూడురోజుల్లో తేల్చకపోతే ఉద్యమం ఉధృతం పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు ఫెయిలయ్యారని రైతు బట్టుపల్లి జైరాం అన్నారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే పిల్లాపాపలతో కలిసి రోడ్లపై వంటవార్పు చే స్తామని హెచ్చరించారు.
Share your comments