వర్షకాలం రానే వచ్చింది. రైతులందరూ పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. మన దేశంలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి ఒకటి. రెండు తెలుగు రాష్టాల్లో భారీ స్థాయిలోనే వరి సాగు చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో పంగసాగు మెరుగ్గా ఉన్నప్పటికీ.. వరినాట్లు పడ్డ తర్వాత.. పంట పెరుగుతునన్న క్రమంలో అనేక రకాల వ్యాధులు, తెగుళ్లు వరిపంటకు సంక్రమిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో జరిగే మార్పులే కారణమని వ్యవసాయ రంగ నిపుణలు చెబుతన్నారు. ముఖ్యంగా వరిలో వచ్చే రకరకాల తెగుళ్లలో ఆకు ఎండు తెగులు ఒకటి. ఇది బ్యాక్టిరియా వల్ల వస్తుంది. వరి సాగులో వచ్చే ఈ ఆకు ఎండు తెగులు, దాని నివారణ చర్యలు గురించి వ్యవసాయ నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం..
బ్యాక్టిరియా ఆకు ఎండు తెగులు వరి నారుమడి నుంచి నాటిన తర్వాత పొట్ట పోసుకుంటున్న దశవరకు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. నారు మడి దశలో ఎండు తెగులు సోకితే ఆకుల చివరి భాగం నుంచి కింది వరకు నీటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పసుపు రంగులోకి మరి మొక్కలు చనిపోతాయి. నాటిన వరిమొక్కలల్లోనూ ఇదే విధంగా ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఎండ తక్కువగా ఉన్న సమయంలో తెగులు సోకిన వరి మొక్కల ఆకులపై పసుపు రంగు జిగురు లాంటి నీటి బిందువులు కనిపిస్తాయి. గోధుమ రంగులో కూడా వచ్చలు ఏర్పడతాయి. వర్షాలు పడటం, గాలి వీచడం వల్ల ఇవి ఇతర మొక్కలకు సంక్రమిస్తాయి. దీని వల్ల మొక్కలు వెన్నలు తక్కువగా వస్తాయి. దీంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది.
బ్యాక్టిరియా ఎండు తెగులు వ్యాధి ప్రధాన కారణం ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటం, అధికంగా నత్రజని ఎరువులు వాడటం. ఈ తెగులును గుర్తించిన వెంటనే ఎరువుల వాడకం తగ్గించాలి. తెగులు సోకిన పొలం నుంచి మరో పొలంలోకి నీరు పారించకూడదు. ఈ తెగులును గుర్తించిన వెంటనే మందులను పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ లో వరి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి.
Share your comments