Agripedia

టమాటా పంటలో వచ్చే బ్యాక్టీరియల్ మచ్చ, చుక్కల నివారణ?

KJ Staff
KJ Staff

రెండు తెగులు రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేసే కూరగాయ పంటల్లో టమాటా కూడా ఒకటి. అయితే, టమాటా పంటలో అధిక దిగుబడులు... రైతుకు మంచి ఆదాయం లభించాలంటే ఆ పంట సస్యరక్షణ చర్యలు ముఖ్యం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఒక్కోసారి మారినప్పుడు పంటపై ప్రతికూల ప్రభావం పడి అనేక రకాల తెగుళ్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టమాటా సాగులో వచ్చే ప్రధాన, సాధారణ తెగుళ్లలో బ్యాక్టీరియల్ మచ్చ, చుక్కల తెగులు ఒకటి. టమటాకు ఈ తెగులు సోకితే పంటకు తీవ్ర స్థాయిలో నష్టం జరుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ టమాట బ్యాక్టీరియల్ మచ్చ, చుక్కల తెగులు ఎంటీ? దీని లక్షణాలు, నివారణ చర్యల గురించి వ్యవసాయ నిపుణులు చెబుతున్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

టమాటలో వచ్చే బ్యాక్టీరియల్ మచ్చ, చుక్కల తెగులు జెనస్క్షంతోమోనాస్ అనే బ్యాక్టీరియా జాతులకు చెందిన వివిధ బ్యాక్టీరియాల వల్ల సంక్రమిస్తుంది. ఈ తెగులుకు కారణమైన సూక్ష్మజీవులు మట్టిలోనూ, విత్తనాల లోపల, పైనా, పంటల అవశేషాలు, వివిధ రకాల కలుపు మొక్కలపై జీవిస్తాయి. మట్టిలో తక్కువ కాలమే జీవించినా.. పంటపై వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి కారక జీవులు తమకు అనుకూలంగా ఉన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటను ఆశిస్తాయి. పంటకు నీరు పెట్టినప్పుడు, చిరు జల్లులు పడినప్పుడు, మంచు కురిసే సమయాలు బ్యాక్టీరియా వ్యాప్తికి అనుకూల పరిస్థితులుగా ఉంటాయి. రైతులు త్వరగా దీనిని గుర్తించకపోతే పంటమొత్తం సోకి.. తీవ్ర నష్ట పరిచి పూర్తి పంటను నాషనం చేసే అవకాశం సైతం ఉంటంది.

బ్యాక్టీరియల్ మచ్చ, చుక్కల తెగులు లక్షణాలు గమనిస్తే.. మొక్కలోని దాదాపు అన్ని భాగాలపై దాడి చేస్తాయి. అయితే, ఆకులు, కాయలు, మొక్క కాండంపై బ్యాక్టీరియా దాడి ప్రభావం అధికంగా ఉండి స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా ఆకులపై పసుపు రంగులోనూ, ముదురు ఆకుపచ్చ రంగులలోనూ మచ్చలు ఏర్పడతాయి. వాటి చుట్టూ సన్నగా పసుపు రంగు వలయం కూడా ఏర్పడుతుంది. ఆకుల కొన, అంచు భాగాల్లో ప్రారంభమైన ఈ మచ్చలు క్రమంగా మొత్తం వ్యాపించి.. టమాట మొక్క ఆకుల సాధారణ రూపాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఆకుల నుంచి క్రమంగా టమాట కాయలు, పండ్లపై కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ప్రభావం అధికమైతే గోధుమ ఎరుపు రంగులోకి మచ్చలు మారుతాయి. కాయలు, పండ్లపై నల్లని ఉబ్బెత్తుగా ఉండే మచ్చలు సైతం ఏర్పడతాయి. వీటి నివారణ కోసం ప్రస్తుత మార్కెట్ లో లభించే రసాయన మందులను పిచికారీ చేసుకోవాలి. పంటకు ఈ తెగులు సోకకుండా తట్టుకునే విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను నారు పోసుకునే ముందు వాటిని 1.3శాతం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో ఒక నిముషం పాటు ముంచి ఆ తరువాత సాధారణ వేడి నీటిలో అరగంట ఉంచడం వల్ల బ్యాక్టీరియల్ మచ్చ, చుక్కల తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.

Share your comments

Subscribe Magazine