వరి భారతీయులకు ప్రధాన ఆహారం. ప్రపంచంలో దాదాపు 45% మంది జనాభా వరినే ప్రధాన ఆహారంగా స్వీకరిస్తున్నారు. మన దేశంలో అధిక సాగు విస్తీర్ణం కలిగిన పంటల్లో వరి ప్రధమ స్థానంలో ఉంది. అయితే వరి సాగుకు మిగిలిన పంటలతో పోలిస్తే ఎక్కువ ,మొత్తంలో నీరు మరియు పోషకాలు అవసరం. అయితే ఈ మధ్య కాలంలో వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు లేక అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. ఇటువంటి ప్రాంతాల్లో నేరుగా వరి నాటే పద్దతిని రైతులు ఉపయోగిస్తున్నారు. వర్షధార పరిస్థితులను తట్టుకొని, నేరుగా విత్తుకోవడానికి అనుకూలంగా ఉండే కొన్ని రకాల వరి వంగడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
PB బాస్మతి 1121:
పూస బాస్మతి 1121 రకం కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని సంపాదించుకుంది. ఎక్కువుగా ఎగుమతి జరిగే వరి బాస్మతి వరి రకాల్లో పూస బాస్మతి 1121 రకం ప్రధానమైనది. పొడవైన గింజ, మంచి సువాసన, అద్భుతమైన రుచి ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాలు పూస బాస్మతి 1121 యొక్క ప్రధాన లక్షణాలు. ఈ రకం వరిని మే 15 నుండి జూన్ 15 వరకు నాటుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని యజమాన్య పద్దతులు సర్రిగా పాటిస్తే ఒక ఎకరానికి 18-20 క్వింటాల్లా దిగుబడి పొందవచ్చు.
PB 1718:
పూస బాస్మతి 1718 రకం మిగిలిన బాస్మతి రకాలతో పోలిస్తే మెరుగైన రోగనిరోధక శక్తిని కనబరుస్తుంది. ఈ రకం వరిలో వచ్చే అన్ని ప్రధానమైన వ్యాధులను తట్టుకొని నిలబడగలడు. సాధారణ వరి వంగడాలతో పోలిస్తే 20% నీటిని ఆదా చేస్తుంది. PB 1718 రకాన్ని మే రెండో వరం నుండి జూన్ మూడో వారం వరకు విత్తుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కేవలం 135 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది, మెరుగైన యాజమాన్య పద్దతులు పాటించడం ద్వారా 20-25 క్వింటాల్లా దిగుబడి పొందవచ్చు.
PB 1885:
ఈ రకం బాస్మతి వరిని ఉత్తమైనదిగా పరిగణిస్తారు. ఈ రకం వరి పొడవైన గింజలు కలిగి ఉంటుంది. వరి సాగులో అధిక నష్టం కలిగించే బ్లాస్ట్ వ్యాధిని సమగ్రవంతంగా తట్టుకొని నిలబడగలడు. 140 రోజుల్లో పరిపాక్వం చెందే ఈ వరి సుమారు 20 క్వింటాల్లా దిగుబడి అందిస్తుంది.
PB 1692:
పూస బాస్మతి వరి రకం అతి కొద్దీ కాలంలోనే పరిపాక్వం చెందుతుంది కాబట్టి రైతులు దీనిని సాగు చేసేందుకు ఎక్కువుగా ఆశక్తి చూపిస్తారు. ఈ రకం పంట కేవలం 115-120 రోజుల్లోనే చేతికి వస్తుంది. తక్కువ నీటి లబ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా సులభంగా సాగు చెయ్యవచ్చు. మంచి నాణ్యత కలిగిన ఈ వరి రకానికి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది.
PB 1847:
పూసా బాస్మతి రకం పిబి 1847ను నేరుగా విత్తడం ద్వారా రైతులు బంపర్ ఉత్పత్తిని పొందవచ్చు. ఈ రకం వరి ముడతలు మరియు గాలిని తట్టుకుంటుంది. వరి నేరుగా విత్తడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైతులు నేరుగా నాట్లు వేస్తే ఎకరాకు 27 నుంచి 32 క్వింటాళ్ల వరకు ఉత్పత్తి అవుతుంది.
Share your comments