Agripedia

అంతరపంటలు సాగు చెయ్యడం వలన కలిగే ప్రయోజనాలు....

KJ Staff
KJ Staff

నైరుతి రుతుపవనాలు పలకరించడంతో ఖరీఫ్ సాగు మొదలయ్యింది, ఈ ఏడాది వర్షాలు ఎక్కువుగా ఉంటాయని తెలియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగునీటి కాలువలకు నీటిని ఇవ్వడం ప్రారంభించారు. సాగు నీరు మరియు వర్షపు నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో సాగుకు ఎటువంటి అంతరాయం ఉండదు అయితే, కేవలం వర్షాల మీద ఆధారపడి పంటలు పండించే ప్రాంతాల్లో రైతులకు సాగు నీటి కష్టాలు లేకపోలేదు. ఇటువంటి ప్రాంతాల్లోని రైతులు వర్షపునీటిని సమర్ధవంతమగా వినియోగించుకునేందుకు కొన్ని నూతన పద్దతులను అవలంభించడం అవసరం. ఇటువంటి ప్రాంతాల్లో అంతరపంటల సాగు ఉపయోగకారిగా ఉంటుంది.

మన రెండు తెలుగు రాష్ట్రాలు అంతరపంటల సాగుకు అనుకూలమే. వర్షపాతం 650-750 మీ.లి ఉండే ప్రాంతాల్లో అంతరపంటలను సాగు చెయ్యడం అనుకూలం. రైతులు కూడా వ్యవసాయంలో నూతన పద్దతులను పాటించడానికి ఆశక్తి చూపుతున్నారు, ఎంతోమంది రైతులు తమ పొలాల్లో ప్రధాన పంటలతోపాటు అంతర పంటలు కూడా సాగు చెయ్యడం ప్రారంభించారు. వీటిని సాగుచెయ్యడం వలన రైతుల ఆదాయం రెట్టింపవ్వాడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ అంతరపంటలను కూడా రైతులు జాగ్రత్తగా ఎంచుకోవాలి, అంతరపంటల వేరు వ్యవస్థ ప్రధాన పంటల వేరు వ్యవస్థకంటే లోతున లేదంటే పైకి ఉండేలా చూడాలి, లేదంటే రెండు పంటలకు మధ్య నీరు మరియు పోషకాల శోషణలో ఆటకం కలుగుతుంది. ఈ అంతర పంటల సాగుకు పైరు మొక్కల మధ్య ఉండే స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు, దీని వలన నీరు, పోషకాలు మరియు సూర్యరశ్మి అన్ని బాగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

అనుకోని ప్రకృతి వైపరీత్యాల వలన ప్రధాన పంట పాడైన రెండో పంట చేదోడుగా ఉంటుంది. అదే ప్రకృతి అనుకూలంగా ఉంటె రెండు పంటల నుండి దిగుబడి పొందేందుకు వీలుంటుంది. అంతర పంటల వలన మరొక్క ప్రయోజనం ఏమిటంటే ఇవి తెగుళ్లు కిటకాలు నుండి ప్రధాన పంటను రక్షిస్తాయి.వ్యవసాయంలో ప్రధాన సమస్యైన కలుపును సమగ్రవంతంగా నివారించడంలో అంతర పంటలు ఎంతగానో దోహదపడతాయి.

అయితే అంతర పంటలుగా ఎటువంటి పంటలు నాటుకోవచ్చు అన్న సందేహం రైతులు ఉంటుంది. ఆకుకూరలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, పూలు మరియు కొన్ని రకాల కూరగాయలను అంతర పంటల సాగుకు అనుకూలం. పప్పుదినుసులు అంతర పంటలుగా సాగు చెయ్యడం ద్వారా ప్రధాన పంటలకు నత్రజని లభిస్తుంది. మొక్కల వేర్లు మట్టిని పట్టి ఉంచి నేలకోతను తగ్గించడంలో సహాయం చేస్తాయి. వర్షాధారితంగా పంటల సాగు చేసే ప్రాంతాల్లో అంతర పంటలు ఎంతో ప్రయోజనం కలిగి ఉంటాయి, వర్షపు నీటిని భూమి పొరల్లో పట్టి ఉంచి ఆ నీరు ఆవిరైపోకుండా కాపాడతయి.

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సాగు చేస్తున్న అంతర పంటల వివరాలు ఈ విధంగా ఉన్నాయి, వేరుశెనగలో అంతరపంటగా కంది సాగు, ఆముదంలో అంతర పంటగా కంది సాగు, మొక్కజొన్నలో అంతరపంటగా కంది, మినుములు మరియు పెసలు వంటివి సాగు చేస్తున్నారు. అంతర పంటలు మరియు ప్రధాన పంటల మధ్య సరైన నిష్పత్తి ఉండేలా చూసుకోవాలి. ప్రధాన పంటల నుండి దిగుబడి వచ్చిన తరువాత ప్రధాన పంటల నుండి దిగుబడి వచ్చేలా చూసుకోవాలి.

Share your comments

Subscribe Magazine