Agripedia

ఎర్ర బియ్యం సాగు.. లాభాలు బహు బాగు!

KJ Staff
KJ Staff

సాధారణంగా మన దేశంలో చాలా మంది రైతులు వరి ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. మనదేశంలో ఆహారంలో భాగంగా అన్నం తినడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలామంది వరి పంటను సాగు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ వరి సాగు విధానం ఉన్నాయి.మనం ఎక్కువగా తెల్ల బియ్యం రకాన్ని మాత్రమే చూసి ఉంటాము. కానీ మనకు తెలియకుండా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ వంటివి కూడా రైతులు సాగు చేస్తున్నారు. మార్కెట్ లో తెల్ల బియ్యం కంటే ప్రస్తుతం ఇతర రకానికి చెందిన బియ్యానికి అధిక డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఎర్ర బియ్యం సాగు చేయడం వల్ల కలిగే లాభాలు.. వాటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎర్ర బియ్యంలో సుమారుగా 34 రకాలకు పైగా పండిస్తున్నారు. ఇందులో కెంపు సన్నం, చంద్రకళ, జకియా, బారాగలి, రక్తసాలి, కాల్‌చర్, కలాంకాలి, నవారా..వంటి రకాలు ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. సన్నగా పొడవుగా ఉండటం వల్ల వీటిలో నవారా రకానికి చెందిన వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రకానికి చెందిన బియ్యం మార్కెట్లో కిలో రూ.120 వరుకు ధర పలుకుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 60 మందికి రైతులకు పైగా ఎర్ర బియ్యం పండిస్తున్నారు.వీరిలో ఎక్కువగా తెనాలి ప్రాంతానికి చెందిన వారు ఎర్ర బియ్యం సాగుపై ఆసక్తి కనబరుస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.

ఎర్ర బియ్యం తినడం వల్ల మధుమేహంతో బాధపడేవారికి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ క్రమంలోనే మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికమవడం వల్ల ఈ ఎర్ర బియ్యానికి అధిక డిమాండ్ ఏర్పడింది. వీటిలో పీచు పదార్థాలు అధికంగా ఉండే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా క్యాల్షియం,ఐరన్, జింక్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 45 శాతం కన్నా తక్కువగా ఉండటంతో మధుమేహులకు ఈ బియ్యం ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. సేంద్రీయ పద్ధతిలో ఈ ఎర్ర బియ్యం సాగు చేయడం వల్ల ఎకరాకు పెట్టుబడి 20 వేలకు మించదు. ఈ పంటను 110 నుంచి 130 రోజుల లోపు తీయవచ్చు. గరిష్టంగా ఒక ఎకరానికి సుమారు 13 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఈ బియ్యానికి అధిక డిమాండ్ ఉండటం వల్ల ఖర్చులు పోను ఎకరాకు సుమారు రైతుకు 50 వేల వరకు ఆదాయం పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine