Agripedia

వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే లాభాలు !

Srikanth B
Srikanth B
Benefits of vermicompost
Benefits of vermicompost

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరిపిన పరిశోధన వల్ల భూసార పెంపుదల, నాణ్యమైన పంట మొక్కకు చీడపీడలను తట్టుకునే శక్తి మరియు నేల ఆరోగ్యం మరియు పరిసరాల కాలుష్య నివారణకు వర్మి కంపోస్ట్ ఎరువు అత్యంత ఉపయోగకరమైనది.

 

వానపాములు అనేవి రైతులకు ఉపకారం చేయడమే తప్ప అపకారం చేయడం తెలియని జీవులు. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలు వర్మీ క్యాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారైయ్యే ఎరువును వర్మీ కంపోస్ట్ అని అంటారు.
మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్లిన కూరగాయలు మరియు పండ్లు ఆకులు చెత్తాచెదారం మొదలైన వాటిని ఆహారంగా తీసుకుంటాయి ఇవి పర్యావరణంలోని వ్యర్ధ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడమేకకా విలువైన అధిక పోషకాలు గలఎరువును రైతులకు అందజేస్తాయి.

వానపాముల యొక్క ఉనికి మరియు కదలికలవల్ల నేల అనేది బాగా గుల్ల బారుతుంది. ఫలితంగా భూమిలోకి గాలి నీరు చొరబడే శక్తి పెరుగుతుంది. వర్మి కంపోస్టు తయారు చేయడానికి వివిధ రకాల వానపాములను ఉపయోగించవచ్చు వాటిలో రెండు రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భూమి పైపొరల్లో ఉండేది (బొరియలు చేయలేని రకాలు) వీటిలో ఐసినియా ఫోటీడా, యులస్ యూజీని రకాలు అత్యంత ముఖ్యమైనవి. భూమి లోపలి పొరల్లో ఉండేవి (బొరియలు చేసే రకాలు) వీటిలో పేరిటియ ఎలాంగెటా పేరిటియ ఏసియాటిక రకాలు అత్యంత ముఖ్యమైనవి. పైన తెలుపబడిన రెండు రకాల్లో ప్రత్యేకించి చెప్పాలంటే నేలపై పొరలను ఉండే రకాలు వర్మి కంపోస్టు తయారు చేయడానికి అనువైన రకాలు.

వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే లాభాలు !

రైతులు క్రమంగా ఈ రసాయన ఎరువుల మీద పూర్తిగా ఆధారపడి శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదు కంటే ఎక్కువగా విచక్షణారహితంగా వాడడం వలన జీవ కణాలు కనుమరుగై పొయాయి. రసాయనిక ఎరువులు విచక్షణరహితంగా వాడటం వలన క్రమక్రమంగా మేలు చేసే సూక్ష్మ జీవులు మరియు వానపాములు అంతరించిపోయాయి. సహజ వాతావరణంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేడు కనుమరుగైపోయాయి.

వర్మి కంపోస్టు తయారీ లాభాలు
వానపాములు సేంద్రియ పదార్దము ఎక్కువగా గల నేలల్లో బొరియలు చేస్తూ నేలను గుల్లగా చేస్తాయి. వీటికి సేంద్రియ పదార్ధంతో మిళితమైన మట్టి ఆహారం అంటే రమారమి 70% మట్టిని, 30% సేంద్రియ పదార్ధాన్ని ఆహారంగా తీసుకొంటాయి. కొన్ని ప్రత్యేకమైన వానపాములు 90% సేంద్రియ పదార్ధము. కేవలం 10% మట్టిని ఆహారంగా తీసుకొంటాయి. సేంద్రియ పదార్ధంతో మిళితమైన మట్టిని ఆహారంగా తీసుకొని విసర్జన చేసిన పదార్ధమే 'వర్మి కంపోస్టు' అంటారు. వానపాములు తీసుకొన్న ఆహారం

జీర్ణవ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన, పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ పదార్ధంలో పోషకాలతో పాటు అనేకరకాల విటమిన్లు ఎంజైములు ఉండటం వల్ల వర్మి కంపోస్టు విలువ దాల ఎక్కువ.

దీపావళి 2022: భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీపావళిని జరుపుకోవడం వెనుక కథలేంటి ?

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More