మన తీసుకునే ఆహార పదర్థాల్లో కాకరకాయ ముఖ్యమైన కూరగాయ. ఇందులో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. రుచికి చేదుగా ఉన్న ఇందులో శరీరానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే.. అధిక మొత్తంలో సీ విటమిన్ కూడా ఉంటుంది. ఐరన్, కాల్షియం వంటి ఖనిజలవణాలు కూడా ఉంటాయి. కాకరకాయ సాగు కూడా రైతులకు లాభదాయకంగా ఉంటుంది. కాకరకాయ సాగు చేయు విధానం, నీటి యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణులు వెల్లడించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కాకరకాయ ఉప-ఉష్ణమండల వాతావరణం పంట. వేడి, తేమతో కూడిన వాతావరణం దీని సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ పంటను ఖరీఫ్, వేసవి సీజన్లలో చేయవచ్చు. దాదాపు అన్నిరకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ నీటి పారుదల వ్యవస్థ ఉండి.. మధ్యస్థంగా ఉన్న నేలల్లో కాకరకాయ పంట దిగుబడి అధికంగా వస్తుంది. భూమి సారవంతంగా లేకపోతే ఏరువులు అధికంగా వాడాల్సి ఉంటుంది. సాగుకోసం పంటను సాగు చేసే క్రమంలోనే పశువుల ఏరువును వేసుకోవాలి. దీని వల్ల దిగుబడి పెరుగుతుంది. మధ్యస్థ లోతు వరకు పొలం మూడు లేదా నాలుగు సార్లు చదునుగా దున్నుకోవాలి. ఈ పంటను పందిర్లు వేసి సాగు చేయవచ్చు. అలాగే, సాధారణంగా తీగ జాతి పంటల సాగు తీరున కూడా సాగు చేయవచ్చు. ప్రస్తుతం మనం పొలానికి అనుకూలంగా ఉన్న రకాలను సాగు కోసం ఎంపిక చేసుకోవాలి.
ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న కాకరకాయవిత్తన రకాల్లో హిరాకని, ఫూలే గ్రీన్గోల్డ్, ఫులే ప్రియాంక, ఫులే ఉజ్వాలా, కోయంబత్తూర్ తెలుపు పొడవుకు చెందినవి మంచి ఆదరణ పొందినవి. విత్తనం నాటిన 60 రోజుల తర్వాత పంట కొతకు వస్తుంది. విత్తన రకాలను బట్టి ఇది మారుతుంది. మొక్కల పెరుగుదలకు అనుగుణంగా ఎన్, పీ, కే మందులను వాడుకోవాలి. కలపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. దీని వల్ల పంటదిగుడి పెరగడంతో పాటు పలు రకాల చీడపీడలు పంటను ఆశించకుండా ఉంటాయి. వేసవి సాగులో మొక్కల పెరుగుదల, పరిస్థితులకు అనుగుణంగా నీరు అందించాల్సి ఉంటుంది. కాకరలో వచ్చే సాధారణ తెగుళ్లలో బూజు, అఫిడ్స్, ప్రూట్ ఫ్లై ముఖ్యమైనవి. వీటి నివారణ కోసం వ్యవసాయ నిపుణల సలహాలు, రసాయన మందులను పిచికారీ చేసుకోవాలి.
Share your comments