మాగాణి రేగడి భూముల్లో మినుము, వరి, పెసర పంటలు తప్ప వేరే పంటలు పండించలేమా అంటే పండించగలము. కొన్ని రకాల ఔషధ పంటలు పండించవచ్చు. బ్రహ్మి మరియు వస వంటి దీర్ఘకాలిక పంటలు, ఎకరానిక లక్ష తగ్గకుండా ప్రతి సంవత్సరం ఆదాయాన్నీ ఇస్తాయి. ఛత్తీస్గడ్ కు చెందిన కొందరు రైతులు మాగాణి రేగడి భూముల్లో ఈ పంటలను పండిస్తూ చక్కని ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
ఛత్తీస్గడ్ ఔషధ మొక్కల బోర్డు ఈ రైతులను ప్రోత్సహిస్తుంది. అక్కడి ప్రభుత్వం వివిధ ఔషధ పరిశ్రమలతో ఒప్పందాలు చేయించి ఇక్కడి రైతులతో ఈ పంటలను సాగు చేయించడం విశేషం.
బ్రహ్మి (బాకోపా మొన్నీయిరి) పంట 4 నెలలో కోతకు వచ్చేస్తుంది. బ్రహ్మి పంట అనేది నెల మీద పాక్ తీగజాతికి చెందిన దీర్ఘకాలిక పంట. ఈ పంటను వరి పంటలానే దమ్ముచేసి, 2-3 అంగుళాలు ఉన్న మొక్క కటింగ్ను నాటాలి. ఒక్కసారి నాటక మళ్లి, 5 ఏళ్ల వరకు నాటవలసిన అవసరం ఉండదు. ఈ బ్రహ్మి పంటలో కలుపు సమస్య ఉండదు ఎందుకనగా ఈ పంట పొలం అంతటా అల్లుకుపోతుంది. అవసరం బట్టి పంట కోతకు వచ్చినప్పుడు కలుపు తీసి, కొడవళ్ళతో బ్రహ్మి మొక్కను కోస్తారు. కోత తర్వాత కొంచెం ఎరువులు చల్లి, కొద్దిగా నీరు పెడితే పంట మల్లి ఎక్కువగా పండుతుంది. కోతకు 3000- 6000 కిలోలు ఎకరానికి దిగుబడి వస్తుంది. ఆ దిగుబడిని ఆరబెడితే కొన్ని రోజుల్లోనే 600 - 700 కిలోల ఎండు బ్రహ్మి తయారు అవుతుంది. మార్కెట్లో బ్రహ్మి పంటకు రూ. 40-50 వరకు ధర ఉంటుంది. ఇంచుమించుగా కోతకు 30 వేల చొప్పున, మరియు ఏడాదికి 90 వేల రూపాయల వరకు రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ మొక్కలను ఎలా నాటాలో రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ పంటకు ఎక్కువగా నిర్వహణ అవసరం లేదు. ఎరువుల బదులు జీవామృతం వదిన సరిపోతాది.
ఇది కూడా చదవండి..
సాగుకు అనుకూలమైన జొన్న రకాలు ...
వస (బచ్-అకౌర్స్ కలమస్) పంట పసుపు పంట వలెనే ఉంటుంది. ఇది 2-3 అడుగుల ఎత్తున పెరుగుతుంది. వస పంట అనేది 9 నెలల పంట. ఈ వస పంటను పండించడానికి కొమ్మలను, లేదా మొక్కలు పెంచైనా నాటుకోవచ్చు. పంట కాలం పూర్తి అయినా తరువాత కొమ్మలను తవ్వి తీసి, ఎండలో ఆరబెట్టి, పాలిషింగ్ చేసి ఔషధ పారిశ్శ్రమాలకు విక్రయించాలి. 10-20 క్వింటాళ్ల వస కొమ్ములు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. ఇంచుమించుగా 50 వేల నుండి లక్ష వరకు ఆదాయం వస్తుంది.
సాధారణ పంటలు కంటే ఔషధ మొక్కలను సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాన్ని పొందుతారు. నల్ల రేగడి భూముల్లో వరికి బదులు ఔషధ మొక్కలైనా బ్రహ్మి, వస వంటి పంటలు పండించుకుని, ఎకరానికి లక్ష వరకు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఛత్తీస్గడ్ ఔషధ మొక్కల బోర్డు రైతులకు మొక్కలను, విత్తనాలను ఇచ్చి ప్రోత్సహిస్తుంది. దానితో పాటు ఔషధ పరిశ్రమలు ,మరియు వ్యాపారులతో ముందుగానే ఒప్పందం చేసుకొని మార్కెటింగ్ సమస్య లేకుండా బోర్డు చేస్తుంది. ఏ రాష్ట్రంలోని రైతులకైనా, సంస్థలుకైనా సేవలను అందించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది.
ఇది కూడా చదవండి..
Share your comments