వ్యవసాయ, అనుబంధ రంగాల ఆదాయం మెరుగుపరిచినందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం రూ. 14,000 కోట్ల తో 7 పథకాలను ప్రారంభించాలని కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం వ్యవసాయ రంగానికి సంబంధించి రూ. 2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మరియు క్రాప్ సైన్స్ కోసం రూ. 3,979 కోట్ల పథకంతో సహా ఏడు పథకాలకు ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ భేటీ అంనతరం మీడియా తో మాట్లాడిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ,ఈ పథకాలు రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించామని తెలిపారు .
ఈ పథకాలు ముఖ్యంగా, పరిశోధన & విద్య, వాతావరణ స్థితిస్థాపకత, సహజ వనరుల నిర్వహణ మరియు వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్‌తో పాటు ఉద్యానవన మరియు పశువుల రంగాల వృద్ధిపై దృష్టి పెడుతుంది.
మొత్తం రూ. 3,979 కోట్లతో ఆహార మరియు పోషకాహార భద్రతా కార్యక్రమాల కోసం క్రాప్ సైన్స్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో, 2047కి వాతావరణాన్ని తట్టుకునే పంట శాస్త్రాలు మరియు ఆహార భద్రత కోసం రైతులను సిద్ధం చేయడంపై దృష్టి సారించి ఆరు స్తంభాలను కార్యక్రమంలో చేర్చారు.
కేంద్రం 6 కీలక విభాగాలలో ఈ పథకాలను రూపొందించింది వాటిలో పరిశోధన మరియు విద్య; మొక్కల జన్యు వనరుల నిర్వహణ; ఆహారం మరియు పశుగ్రాసం పంటకు జన్యుపరమైన మెరుగుదల; పప్పుధాన్యాలు మరియు నూనెగింజల పంట మెరుగుదల; వాణిజ్య పంటల అభివృద్ధి; మరియు కీటకాలు, సూక్ష్మజీవులు, పరాగ సంపర్కాలపై పరిశోధన.
వ్యవసాయ విద్య, నిర్వహణ, సామాజిక శాస్త్రాలను బలోపేతం చేసేందుకు రూ.2,291 కోట్లను వెచ్చించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద ఉంటుంది. అలాగే రూ.2,817 కోట్ల పెట్టుబడితో డిజిటల్ అగ్రికల్చర్, పశువుల ఆరోగ్యం మరియు వాటి ఉత్పత్తి కోసం రూ.1,702 కోట్లలు ,కృషి విజ్ఞాన కేంద్రాన్ని బలోపేతం చేయడానికి రూ. 1,202 కోట్లు మరియు సహజ వనరుల నిర్వహణకు రూ. 1,115 కోట్లు, కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
Share your comments