Agripedia

ఛత్తీస్‌గఢ్ 2022-23లో 11 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి !

Srikanth B
Srikanth B

 

గత సంవత్సరం, రాష్ట్రంలోని సాగుదారుల నుండి సుమారు 98 లక్షల మెట్రిక్ టన్నుల వరిని FCI సేకరించింది . ఈ సంవత్సరం ఛత్తీస్‌గఢ్ లో వరి ఉత్పత్తి గణనీయంగ పెరిగే అవకాశం ఉందని 2022-23 సంవత్సరానికి గాను 110 లక్షల మెట్రిక్ టన్నుల పైగా వరి ఉత్పత్తి జరగనున్నట్లు . ఆ మొత్తని సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనది.



ఛత్తీస్‌గఢ్ 2022-23లో 11 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి !
ఛత్తీస్‌గఢ్ 2022-23లో 11 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి !

ఈ వరి సేకరణ నవంబర్ 1 న ప్రారంభమై జనవరి 31 తో ముగియనుంది . కొనుగోళ్లు ప్రారంభించే ముందు అన్ని సహకార సంఘాలలో అక్టోబర్ 26 నుండి 28 వరకు డ్రైవ్ యొక్క ట్రయల్ రన్ నిర్వహించబడుతుంది.

ప్రభుత్వ అధికారి ప్రకారం, ప్రస్తుత ఖరీఫ్ విక్రయ సీజన్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని రైతులు దాదాపు 110 లక్షల మెట్రిక్ టన్నుల (MT) వరిని కనీస మద్దతు ధర (MSP)కి విక్రయించాలని భావిస్తున్నారు.

గతేడాది రాష్ట్ర రైతుల నుంచి దాదాపు 98 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసిన FCI ఈ సంవత్సరం . వరి కొనుగోలు డ్రైవ్ నవంబర్ 1-ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం-న ప్రారంభమై తదుపరి సంవత్సరం జనవరి 31న ముగుస్తుంది.

వరి కొనుగోలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు, 25 లక్షలకు పైగా రైతులు నమోదు చేసుకున్నారు, వారిలో 95,000 మంది తాజా రిజిస్ట్రేషన్‌లుగా, నిర్దేశిత కేంద్రాలలో వరి ని విక్రయించడానికి రైతులు ఈపాటికే సన్నద్ధమై ఉన్నారు .

Lumpy Skin Disease: తెలంగాణాలోను లంపి చర్మ వ్యాధి ..

గతేడాది నమోదు చేసుకున్న రైతులు ఈ ఏడాది కూడా నమోదు చేసుకోవాలని అధికారి పేర్కొన్నారు. ఈ ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో దాదాపు 110 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం కొనుగోలు జరుగుతుందని, ఇందుకోసం 5.50 లక్షల బండిల్స్‌ జ్యూట్‌ గన్నీ బ్యాగులు అవసరమవుతాయని చెప్పారు.

అధికారిక కొనుగోలు ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు, అక్టోబర్ 26 నుండి అక్టోబర్ 28 వరకు అన్ని సహకార సంఘాలలో డ్రైవ్ యొక్క టెస్ట్ రన్ నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న వరి ధాన్యాన్ని అరికట్టేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ, ఆహార, సహకార, అటవీ శాఖల బృందాలను ఏర్పాటు చేశామన్నారు.ఈ ఏడాది జూన్‌లో 2022–2023 పంట సంవత్సరానికి వరి కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 2,040కి కేంద్రం పెంచింది.

Lumpy Skin Disease: తెలంగాణాలోను లంపి చర్మ వ్యాధి ..

Share your comments

Subscribe Magazine