Agripedia

కొబ్బరి మరియు పామాయిల్ పంటలో అంతర్ పంటగా 'కోకో'!

Gokavarapu siva
Gokavarapu siva

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోకో పంట సాగు గమణియంగా పెరిగింది. అంతర్జాతీయంగా ఈ కోకో పంటకు అధికంగా డిమాండ్ ఉంటుంది. ఎందుకనగా ఈ కోకొను చాకలేట్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కోకో పంటను సాగు చేయడంలో మొదటి స్థానంలో ఉంది. ఈ కోకో పంట కూడా పామాయిల్ పంట తరహాలోనే ఎక్కువగా నిర్వహణ అవసరం ఉండదు. కాబట్టి గోదావరి జిల్లాలో అంతర్ పంటగా రైతులు ఈ కోకో పంటను ఎంచుకుని సాగు చేస్తున్నారు. దాని ద్వారా రైతులు అధిక లాభాన్ని కూడా పొందుతున్నారు.

ఈ కోకో పంట రైతులకు అధిక లాభాన్ని ఇస్తునందున్న ప్రభుత్వం కూడా ఈ కోకో పంటను సాగు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ప్రధానంగా ఈ కోకో పంటను గోదావరి జిల్లాలో మెత్త ప్రాంతాలలో కొబ్బరి మరియు పామాయిల్ లో అంతర్ పంటగా సాగు చేస్తున్నారు. పైగా మొడ్ద మూడు సంవత్సరాలకు ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది. అందువలన జిల్లాలో ఈ కోకో సాగు బాగా పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తానికి 39,714 హెక్టార్లలో ఈ కోకో పంట సాగు సాగుతుంది. అయితే కేవేలం ఏలూరు జిల్లాకు చెందిన 4 మండళ్లలోనే 14,364 హెక్టార్ల కోకో సాగు అనేది జరుగుతుంది. ఈ కోకో సాగు పశ్చిమగోదావరి జిల్లాకు 1990 లో పరిచయం కాగా ప్రతి ఏడాది దీని విస్తీర్ణం గమణియంగా పెరుగుతుంది. మొత్తానికి ఏలూరు జిల్లాలో వెయ్యి హెక్టార్లలో ఈ కోకో సాగు ప్రస్తుతం జరుగుతుంది.

ఇది కూడా చదవండి..

డ్రాగన్ ఫ్రూట్ - తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..

కోకో సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు మరియు పశ్చిమగోదావరి జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ కోకో సాగు నుండి సగటున 10,903 మెట్రిక్ టన్నుల దిగుబడి అనేది వస్తుంది. తమిళనాడులో 32,080 హెక్టార్లలో 2,802.45 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే కేరళ రాష్ట్రంలో 17,366 హెక్టార్లలో సాగు జరుగుతుండగా 9,647.40 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే కర్ణాటకలో 14,216 హెక్టార్లలో 3,719.10 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో హెక్టారుకు సగటున 950 కిలోలు, తమిళనాడులో 350 కిలోలు, కర్ణాటకలో 525, కేరళలో 850 కిలోలు దిగుబడి వస్తుంది.

ఈ కోకో పంటను 1990లో కేంద్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ కాజునట్ అండ్ కోకో డెవలప్మెంట్ ద్వారా సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి పరిచయం అయింది. రైతులకు కావలసిన మొక్కలను జిల్లాలో మాండలీజ్ అనే కంపెనీ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ కోకోను అంతర్ పంటగా వేసిన రైతులకు అదనంగా ఎకరానికి 80 వేల రూపాయల చొప్పున ఆదాయం లభిస్తుంది. ఈ కోకో మొక్కలు నాటిన 4 సంవత్సరాల తరువాత నుండి దిగుబడి ఇస్తుంది. అక్కడి నుండి 30 ఎళ్ల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది.

ఇది కూడా చదవండి..

డ్రాగన్ ఫ్రూట్ - తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..

Related Topics

cocoa intercrops

Share your comments

Subscribe Magazine