Agripedia

కొత్తిమీరను ఇలా సాగు చేస్తే లాభాల పంటే..?

KJ Staff
KJ Staff
Coriander Cultivation
Coriander Cultivation

మన దేశంలో అత్యధికంగా సాగు చేస్తున్న సుగంధ ద్రవ్యాల్లో ధనియాలు ఒకటి.  ధనియాలను అందించే ధనియ మొక్కలు లేదా కొత్తిమీరతో భారతీయ వంటకాలకు వీడదీయలేని బంధం ఉంది. దాదాపు అన్ని రకాల కూరల్లో కొత్తిమీరను, ధనియాల పొడి, ధనియాలను ఉపయోగిస్తుంటారు. అందుకే మార్కెట్ లో దీనికి అధిక డిమాండ్ ఉంటుంది. తక్కువ కాలంలో కొతకు రావడం, సాగుకు  పెట్టుబడి సైతం తక్కువగానే అవుతుండటంతో రైతులు దీనిని పెద్ద మొత్తంలోనే సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో కొత్తిమీర ధర రికార్డు స్థాయిలో పలుకుతుంటుంది. అయితే, కొన్ని మెళుకువలు పాటించిన దీనిని సాగుచేస్తే దిగుబడి అధికంగా వస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

కొత్తిమీర సాగు విధానం-మెళుకువలు:

కొత్తిమీర సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. కానీ నీరు అధికంగా నిల్వ వుండటం, ఎండలు అధికంగా ఉండటం పంటపై ప్రభావం చూపుతాయి. కొత్తిమీర సాగు చేయాలనుకున్న నేలను రెండు నుంచి మూడు సార్లు దున్నుకోవాలి. నేల తేలికగా ఉంటే పంట దిగుబడి అధికంగా ఉంటుంది.  చిన్న చిన్న మడులుగా చేసుకునీ, విత్తనం ఒక సెంటీమీటర్ లోతులో పడే విధంగా విత్తుకోవాలి. దీని వల్ల నీరు అందించడానికి అనుకూలంగా ఉంటుంది. తక్కవ లొతులో విత్తనం పడటం వల్ల మొలకశాతం సైతం అధికంగా వస్తుంది. నేలను తయారు చేసకునే సమయంలో ఒక ఎకరాకు 10 టన్నుల వరకు పశువుల ఎరువులు వేసుకోవాలి. పెరుగుతున్న సమయంలో నత్రజని, యూరియా ఎరువులను చల్లుకోవడం వల్ల కొత్తిమీర ఏపుగా పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల కంపెనీలు కొత్తిమీర విత్తనాలు అందిస్తున్నాయి. కాబట్టి మన నేలకు అనుకూలంగా ఉండే విత్తనం రకం ఎంపిక చేసుకోవాలి. ఒక ఎకరం పొలానికి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం అవసరం అవుతుంది.

సస్య రక్షణ/నీటి యాజమాన్యం:

ఎండలు అధికంగా ఉంటే కొత్తిమీర పంట దిగుబడి పై ప్రభావం పడుతుంది. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటే రోజుకు రెండు సార్లు నీరు పెట్టాలి. మరీ ఎక్కువగా పెడితే తెగుళ్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.  కొత్తిమీరలో ప్రధానంగా వచ్చే తెగులు మాడుగు తెగులు, ఆకుమచ్చ తెగులు. దీని నివారణ కోసం మార్కెట్ లో లభించే మందులను పిచికారి చేసుకోవాల్సి  ఉంటుంది. కొత్తిమీర సాధారణంగా 40 నుంచి 50 రోజుల వ్యవధిలో కొతకు వస్తుంది. కాబట్టి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తే మంచి లాభాలు కొత్తిమీర సాగుతో వస్తాయి.

Share your comments

Subscribe Magazine