Agripedia

పత్తి సాగు చేయు విధానం.. విత్తనాలు విత్తుకోవడం!

KJ Staff
KJ Staff

మన దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు రెండు తెగులు రాష్ట్రాల్లో రైతులు అత్యధికంగా సాగు చేస్తున్న పంటల్లో పత్తి పంట కూడా ఒకటి. పత్తి పంటను ఎలా పండించాలి? ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి? పత్తి సాగులో నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి? నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి? సహా పలు అంశాలకు సంబంధించి వ్యవసాయ నిపుణులు అందజేస్తున్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణంగా పత్తి పంటను సాగు చేయడానికి అన్ని రకాల సాధారణ నేలలు అనుకూలంగానే ఉంటాయి. కానీ వర్షాధారంగా పండించే పత్తి సాగుకు నల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉండటంతో పాటు పంట దిగుబడి కూడా అధికంగా వస్తుంది. పత్తి సాగుకు ముందుగా నేలను వేసవిలోనే రెండు మూడు సార్లు లోతుగా దున్నుకోవాలి. నేలను సిద్ధం చేసుకునే సమయంలోనే పశువుల ఏరువులు వేసుకుని నేలను చదునుగా దున్నుకోవాలి. విత్తనాలు నాటుకునే ముందు వర్షం పడిన మోతాదు, నేలలో తగినంత తేమ చూసుకుని విత్తనం నాటుకోవాలి. ఒక ఎకరాకు దాదాపు 900 గ్రాముల విత్తనాల అవసరం అవుతాయి. మార్కెట్ లో ప్రస్తుతం చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజాధారణ పొందిన విత్తనాలను, మన నేలకు అనుకూలంగా ఉండే విత్తనాలను ఎంచుకోవాలి. ఈ విషయంలో వ్యవసాయ నిపుణులు సలహాలు తీసుకోవడం ఉత్తమం. విత్తనాలు విత్తే వరుస మధ్య దూరం విత్తన రకాన్ని బట్టి 120 సెంటీమీటర్ల వరకు ఉండాలి. విత్తనాలు పెట్టిన కొన్ని చోట్ల విత్తనాలు మొలకెత్తకపోతే.. మళ్లీ ఖాళీ స్థలాల్లో విత్తనాలు నాటుకోవాలి.

విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఎన్ పీ కే సమ్మెళనం ఎరువులను మూడు వారలకు వేసుకోవాలి. మొదటి విడుత మందులు వేసిన తర్వాత మళ్లీ మూడు వారాలకు ఎరువులు మొక్కలకు అందించాలి. మళ్లీ మూడు మూడు వారాల తర్వాత రెండు సార్లు ఎరువులు అందించాలి. దీని వల్ల మొక్కలు పెరుగదల మెరుగ్గా ఉంటుంది. పంట దిగుబడి అధికంగా వస్తుంది. నాణ్యత సైతం పెరుగుతుంది. వర్షాధార పంట కాకపోతే.. నీటిని అందించే సౌలభ్యం ఉంటే తేమను బట్టి మూడు వారాలకు ఒక సారి నీటిని పెట్టాలి. కలుపు లేకుండా కలుపు నివారణ మందులు పిచికారీ చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine