Agripedia

పత్తి పంటలో చేప్పట్టవల్సిన యజమాన్య చర్యలు....

KJ Staff
KJ Staff


ప్రపంచం మొత్తమీద పత్తి ఎక్కువుగా పండేది మన దేశంలోనే. భారతదేశంలో పత్తి అధిక విస్తీరణంలో, వాణిజ్య పంటగా సాగవుతోంది. సుమారు 10 మిలియన్ హెక్టార్లలో సాగయ్యే పత్తి పంట ఎగుమతిలో రెండవ స్థానంలో ఉంది. మన దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో పత్తిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభం కావడంతో, రైతులు పత్తి పంటను సాగు చెయ్యడానికి సన్నద్ధమవుతున్నారు. పత్తిని సాగు చేసే సాయంలో పాటించవలసిన యజమాన్య పద్దతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పత్తిని వర్షాధార పంటగా సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మొదలైనప్పటికీ ఆశించిన రీతిలో వర్షాలు కురవలేదు. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే పత్తి సాగును ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో సాగు చేస్తారు, ఈ సమయానికి వర్షాలు ఎక్కువుగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఆగష్టు వరకు పత్తి విత్తుకోవడకని వీలుగా ఉంటుంది. దీనితో ఇప్పటికే కొంత మంది రైతులు పత్తి విత్తడం ప్రారంభించారు.

కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పత్తి విత్తడం పూర్తవడంతో, పంట 10-25 రోజుల మధ్యలో ఉంది. ఇంకొన్ని ప్రాంతాల్లో విత్తడం ఇప్పుడే ప్రారంభించారు, ఇటువంటి భిన్న వాతావరణ పరిస్థితుల్లో పత్తి సాగు కొనసాగుతుంది. రైతులు రాబోయే వాతావరణ పరిస్థితులకు ముందుగానే సంసిద్ధమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలల్లో వర్షాలు అధికంగా ఉంటాయని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు, కాబట్టి, అధిక వర్షాలకు పంట పాడవకుండా రైతులు నివారణ చర్యలు పాటించవలసి ఉంటుంది.

వర్షాలు అధికంగా ఉన్నపుడు, పత్తి మొక్కలు స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలను తీసుకోలేవు, దీనితో పత్తిలో ఎదుగుదల లోపిస్తుంది. పొలంలో నీరు ఎక్కువ రోజులు నిలిచినట్లైతే, పంట ఎదుగుదల ఆగిపోతుంది, ఇది దిగుబడి మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మొక్కలు పూత మరియు కాయ దశలో ఉన్నపుడు వర్షాలు ఎక్కువుగా ఉంటే, కాయలు రాలిపోతాయి. కాబట్టి, వర్షకాలం ప్రారంభానికి ముందే నీరు బయటకి పోవడానికి బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షాలు కురవడం ఆగిన వెంటనే నీటిని పొలంనుండి తీసేసే ఏర్పాటు చెయ్యాలి.

అధిక వర్షాలకు గురైన మొక్కలో పోషకాల లోపం ఎక్కువగా కనబడుతుంది. వర్షాలు కురిసిన తరువాత మొక్కలకు సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందించాలి. సూక్ష్మ పోషకాల్లో ముఖ్యంగా ఐరన్, బోరాన్, జింక్ పోషకాల లోపం కనబడుతుంది. సూక్ష్మ పోషకాల లోపాల్ని సరిచేసేందుకు, న్యూట్రియెంట్ మిక్సచర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. వర్షాలు ఎక్కువుగా ఉంటే వేరు కుళ్ళు మరియు ఎండు కుళ్ళు తెగుళ్లు రావడానికి కూడా అవకాశం ఎక్కువుగా ఉంటుంది, దీనిని నివారించడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ఈ విధంగా రాబోయే వర్షాకాలానికి రైతులు సంసిద్దమ్మవాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine