Agripedia

సీతాఫలం సాగుకు అనుకూలమైన వాతావరణం.. యాజమాన్య పద్ధతులు..

Srikanth B
Srikanth B

ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా మంది రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక లాభాలను సమకూర్చే ఉద్యాన తోటలను పెంచడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అత్యంత బెట్ట పరిస్థితులను తట్టుకుని రైతులకు నిలకడైన ఆదాయాన్ని సమకూర్చే పంటల్లో సీతాఫలం ప్రధానమైనదిగా చెప్పవచ్చు.

అత్యంత బెట్ట పరిస్థితులను సైతం తట్టుకొని జీవించగల సీతాఫలం మొక్కలను మెట్ట ప్రాంత వ్యవసాయదారులు సాగు చేసి నిలకడైన ఆదాయాన్ని పొందవచ్చని ఉద్యాన శాఖ అధికారులు సూచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని తక్కువ వర్షపాతం గల మెట్ట భూముల్లో మరియు ఏ పంటకూ అనువుగాని భూముల్లో రైతులు సాగు చేస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.సీతాఫలం తోటల సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు నాటే విధానం వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వాతావరణం : సీతాఫలం మొక్కలు సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో సమృద్ధిగా పెరిగి అత్యంత నాణ్యమైన కాయ దిగుబడినిస్తాయి. వర్షపాతం 50 నుంచి 75 సెంటీ మీటర్లు అనుకూలం. ఎక్కువ చలి,మంచును తట్టుకోలేదు.అధిక వర్షా భావ పరిస్థితులను, వర్షపాతాన్ని తట్టుకోలేదు. పుష్పించే దశలో పొడి వాతావరణం, కాయ దశలో అధిక తేమ,అధిక చలి ఉంటే కాయలు పండుబారాక గట్టిగా, నల్లగా మారతాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అయితే పూత రాలిపోతుంది.

నేలలు: సీతాఫలం మొక్కలు ఎటువంటి నెలలోనైనా పెంచుకోవచ్చు. అయితే వ్యాపార
శైలిలో పెంచుకునే టప్పుడు క్షార స్వభావం గల నేలలు, చౌడు నేలల్లో పెంచుకోవడం నష్టం కలిగిస్తుంది. రాళ్లతో ఉన్న నేలల్లో కూడా సాగు చేయొచ్చు. మురుగునీరు పోయే సదుపాయం కలిగి 5.5-7.5 ఉదజని సూచిక గల నేలలు అత్యంత అనుకూలం.

నాటే పద్ధతి : పొలాన్ని ఒకటికి రెండుసార్లు బాగా కలియ దున్ని సమాంతరంగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత 60x60X60 సెం.మీ. గుంతలను 5x5 మీ. దూరంలో ఎకరానికి 160 గుంతలు తీసుకోవాలి. ప్రతీ గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్; 100 గ్రా. ఫాలిడాల్ పొడి, పైమట్టితో బాగా కలిపి గుంతలను నింపుకోవాలి.

నీటి యాజమాన్యం: మొక్కలు నాటిన వెంటనే నీరు అందించాలి. తర్వాత నేల స్వభావం, వాతావరణాన్ని బట్టి మొక్కలకు అవసరమైన నీటిని అందిస్తూ ఉండాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండవు. డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల, దిగుబడి అధికంగా ఉంటుంది.

సేంద్రీయ వ్యవసాయంపై దేశ వ్యాప్త ప్రచారం... కిసాన్ మోర్చా అధినేత రాజ్‌కుమార్ చాహర్

Share your comments

Subscribe Magazine