ప్రపంచం అద్భుతాల సమాహారం..... అన్వేషించాలి కానీ ఎదో ఒక ఆసక్తికరమైన విష్యం వెలుగులోకి వస్తూనే ఉంటుంది. భూమి మీద ఎన్నో రకాల జీవరాసులు జీవిస్తున్నాయి. మనకు తెలిసినవి కొన్నైతే.. తెలియనివి ఇంకెన్నో.... విభిన్న జీవరాసులలో భాగంగా చెంచా వంటి ముక్కు ఆకారం కలిగిన ఒక పక్షి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్పూన్ బిల్డ్ సాండ్పైపర్ దీనినే శాస్త్రీయంగా కలిడ్రిస్ పిగ్మియే అని కూడా పిలుస్తారు. ఈ పక్షి కూడా అన్ని పక్షులలాగే కానీ చెంచా వంటి ముక్కు ఆకారం కలిగే ఉండటం ఈ పక్షి లక్షణం. ఈ పక్షి ఉత్తర పసిఫిక్ ఓషన్, బిరింగ్ సముద్ర తీర ప్రాంతాల్లో జీవిస్తుంది. ఈ పక్షులు నీటికి దగ్గరగా తమ గుళ్ళు ఏర్పరచుకుంటాయి. ఈ పక్షి ఆకారంలో చాల చిన్నదిగా ఉంటుంది. 14-15 సెంటీమీటర్ల పొడవు, ఇంకా బరువు 31 నుండి 40 గ్రాముల వరకు తూగుతుంది. ఈ పక్షి యొక్క ముక్కు ఈ విధంగా ఉండటంవలన మరొక్క ఉపయోగం ఉంది, ఇది దీని ఆహారాన్ని 'రన్ అండ్ పిక్' అనే పద్ధతి ద్వారా వేటాడుతుంది. ఇది దీని ముక్కుతో ఇసుక లోపల దాగి ఉన్న పురుగుల్ని పట్టి తింటుంది.
చెరువుల్లో పెరిగే నాచు, దోమలు, ఇతర కీటకాలు ఈ పక్షికి ఆహరం. ఈ పక్షి శీతల మండలాల్లో జీవించడం వలన, శీతాకాలంలో,చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేసియా, మైన్మార్, బాంగ్లాదేశ్ వంటి దేశాలకు వలస వస్తుంది. భారత దేశంలో కూడా ఈ పక్షి వలస వచ్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ పక్షి జీవిత కాలం దాదాపు 10 సంవత్సరాలు.
దురదృష్టవశాత్తు ఈ పక్షి అంతరించిపోయే జాతుల్లో ఒకటి. ప్రస్తుతం వీటి సంఖ్య 2500 కంటే తక్కువే ఉన్నాయి, ఈ పక్షి ఆవాసయోగ్యమైన ప్రదేశాల్ని నాశనం చెయ్యడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ సహజ వనరుల పరిరక్షణ యూనియన్ వీటి సంతతి వేగంగా తగ్గిపోతున్నట్లు, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని సంవత్సరాలలో, ఈ పక్షులు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ భూమి పుట్టిన ప్రతీ ప్రాణికి మనతో కలిసి జీవించేందుకు సమాన హక్కులున్నాయి, అయితే మానవ తప్పిదాల వాళ్ళ ఎన్నో ప్రాణులు అంతరించిపోయాయి, మరికొన్ని ప్రాణులు అంతరించిపోయాయి.
Share your comments