Agripedia

వర్షాకాలం వరిలో వచ్చు చీడపీడలు మరియు వాటి కారణాలు....

KJ Staff
KJ Staff

వరి పంటను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశమంతటా ప్రధానంగా సాగుచేస్తారు. ధాన్యం భారతీయుల యొక్క ప్రధాన ఆహారం, అలాగే ప్రపంచంలోనే ధాన్యం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత దేశం రెండొవ స్థానంలో ఉంది. మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా వరిలో ఎన్నో కొత్త రకాల వంగడాలు పుట్టుకొచ్చాయి. దీనితోపాటు వరిపంటలో తెగుళ్లు మరియు చీడపీడల బెడద కూడా ఎక్కువైయ్యింది. వరిలో పురుగుల ఉదృతి ఎక్కువవ్వడానికి అనుకూలించే వాతావరణ పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాండం తొలిచూపురుగు:

ఈ పురుగు కాండం లోపలి భాగాన్ని ఆశించి వాటిని తినడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారడం, తెల్లని కంకి మరియు కాళీ గింజలు ఏర్పడటం వంటి వాటిని గమనించవచ్చు. వాతావరణం పొడిగా ఉంది మరియు రాత్రి ఉష్ణోగ్రతలు చల్లగా ఉండటం ఈ పురుగుల ఉధృతికి కారణం, అంతేకాకుండా సూర్యరశ్మి 7 గంటలకంటే తక్కువ ఉంటే వీటి ఉదృతి ఎక్కువవుతుంది.

ఆకు ముడత తెగులు:

ఖరీఫ్ సీజన్లో వర్షాలు పడటం మాములే, అయితే ఒక్కోసారి భారీ వర్షాలు కురిసి, వాతావరణంలో అధిక తేమ కారణంగా పగటిపూట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు నమోదవ్వడం, మరియు రాత్రిపూట 17 డిగ్రీలు నమోదుకావడం మరియు వాతావరణం మబ్బుగా, గాలిలో తేమ 90% కంటే ఎక్కువ ఉంటె ఈ తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది.

సుడి దోమ:

వరి పంటను సుడి దోమ ఆశించడానికి, రెండు వారాలకంటే ఎక్కువ 30 మిల్లీమీటర్లకంటే ఎక్కువ వర్షపాతం ఉండటం, మరియు రాత్రి పుట అధిక ఉష్ణోగ్రతలు, 21-23 డిగ్రీల మధ్యలో ఉంటే ఈ సుడి దోమ బెడద ఎక్కువగా ఉంటుంది.


తాటాకు తెగులు(హిస్సా):

ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో బాగా వర్షాలు పడి, పంట ఎదిగే సమయంలో బెట్ట పరిస్థితులు ఏర్పడటం, పగలు మరియు రాత్రుళ్లు సన్నని వర్షపు జల్లులతో ఉండే వాతావరణం ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.

ఆకు ఎండు తెగులు:

ఈ తెగులు సోకిన మొక్కలని మొదట పసుపు రంగులోకి మారి, ఉన్నటుండి ఎండిపోవడం గమనించవచ్చు. పగటిపూట ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల మధ్య ఉండటం, గాలిలో అధిక తేమ, మరియు గాలితో కూడిన వర్షం కురవడం ఈ వ్యాధి వ్యాప్తి చెండానికి కారణమౌతుంది.

పొట్టకుళ్ళు తెగులు:

రాత్రిపూట ఉష్ణోగ్రత 20 ℃ కంటే తక్కువ మరియు గాలిలో తేమ 90 శాతంకంటే ఎక్కువ ఉండటం మరియు మంచు కురవడం లేదా ఉన్నటుంది వాతావరణం చల్లగా మారిపోవడం ఈ వ్యాధి వ్యాప్తి చెందేందుకు కారణమవుతుంది.

గోధుమ ఆకుమచ్చ తెగులు:

గాలిలో తేమ ఎక్కువగా ఉంది, నైరుతి ఋతుపవనాలు ఆలస్యమైనా సంవత్సరం ఈ తెగులు ఎక్కువవుతుంది,ఈ తెగులు పంట మొత్తం వేగంగా వ్యాపించి రోగాలకు కారణమవుతుంది.

మాని పండు తెగులు:

మొక్కలు పూత దశకు చేరాక, మబ్బులతో కూడిన జల్లులు కురవడం, మరియు తుఫాను వాతావరణం నెలకొనడం ఈ వ్యాధి వ్యాప్తికి కారణం, అంతేకాకుండా వాతావరణంలో తేమ 90% చేరుకున్న సమయంలో కూడా ఈ వ్యాధి ఉదృతి ఎక్కువగా ఉంటుంది.

Share your comments

Subscribe Magazine