సిక్కిం స్టేట్ కోఆపరేటివ్ సప్లై అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్( SIMFED) నిర్వహిస్తున్న మొదటి ఆర్గానిక్ నార్త్-ఈస్ట్ ఎక్స్‌పో 2023 అస్సాం రాజధాని ఖానాపరా వెటర్నరీ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు మూడు రోజుల జరగనుంది. మూడు రోజుల పాటు సాగె ఈ ఎక్స్‌పో లో అస్సాం మరియు ఈశాన్య ప్రాంతాల్లోని సేంద్రీయ రైతులను లక్ష్యంగా చేసుకొని సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన తీసుకురావడానికి అస్సాం ప్రభుత్వం సిక్కిం స్టేట్ కోఆపరేటివ్ సప్లై అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్( SIMFED) బాగా స్వామ్యంతో ఈ ఎక్సపో ని నిర్వహిస్తుంది .
ఎక్సపో ముఖ్య ఉద్దేశం :
అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శన .
సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన
పాల్గొన్న వ్యక్తులతో నెట్‌వర్కింగ్ చేయడం ద్వారా అధిక మొత్తం లో అవగాహనా అందించి సేంద్రీయ ఉత్పత్తి ప్రక్రియను ప్రోత్సహించడం .
రైతుల సమస్యలకు నిపుణుల సలహాలు & సూచనలను అందించడం .
ప్రదర్శనలో ఆకర్షణీయమైన ఆర్గానిక్ ఉత్పత్తుల శ్రేణి.
సేంద్రీయ ఉత్పత్తి యొక్క భవిష్యత్తు యొక్క కార్యాచరణ
.
రైతులు ఉత్పత్తులను ప్రదర్శించడానికి, ఉత్పత్తులను విస్తృత పరచడానికి రైతులకు వేదిక కల్పించడం .
ఆర్గానిక్ నార్త్-ఈస్ట్ ఎక్స్‌పో 2023.. రైతులకు ఎలా ఉపయోగపడుతుంది!
ఈవెంట్ యొక్క ప్రధాన కార్యాక్రమాలు :
ప్రదర్శన:
సేంద్రీయ మరియు సహజ బ్రాండ్‌ల 160కి పైగా బూత్‌లు విభిన్న శ్రేణి ఆర్గానిక్ ఉత్పత్తుల ను ప్రదర్శిస్తాయి. రైతు నుంచి చిరు వ్యాపారుల ఉత్పత్తులు ప్రదర్శించబడుతాయి .
రాష్ట్రాల ప్రభుత్వసంస్థలు : కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లు. రైతు సంఘాలకు మద్దతిస్తామన్నారు
వివిధ ప్రభుత్వాలతో సేంద్రీయ వ్యవసాయం & మార్కెటింగ్ కోసం పథకాలు/మద్దతు.
అంతర్జాతీయ సమావేశం:
02 రోజుల పాటు నాలెడ్జ్ షేరింగ్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతుంది. భారతదేశం మరియు విదేశాల నుండి ఎగుమతిదారులు. విభిన్న రంగాలకు చెందిన 250+ ప్రతినిధులురైతులు, వ్యాపారులు/ఎగుమతిదారులు, పరిశోధకులు, NGOలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమావేశంలో పాల్గొంటాయి .
Share your comments