ప్రస్తుత కాలంలో రైతులు పంటలు పండించాలంటే అధిక సంఖ్యలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఈక్రమంలోనే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలా మంది అధిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కలుపు తీయడం, నాట్లు వేయడానికి కూలీల కొరత అధికంగా ఉంది. అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తే కానీ కూలీలు దొరకని పక్షంలో ఓ యువకుడు యూట్యూబ్ ద్వారా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్ లో పలు వీడియోలను చూసి కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు.
ప్రస్తుతం ఈ రైతు తాను తయారుచేసిన యంత్రంతో వరి లో ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో కూలీలు అవసరం లేకుండా సులభంగా కలుపు తీయగలుగుతున్నారు.ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థ తో సదరు యువకుడు ఈ యంత్రాన్ని ఏవిధంగా తయారు చేయాలనే విషయాన్ని కూడా వెల్లడించాడు.
మూడు ఫీట్ల పొడవున్న రెండు ఇంచుల పీవీసీ పైపు, ఆఫ్ ఇంచ్ ఇనుప పైపు, 25 గొలుసులు తీసుకోవాలి. ముందుగా అర్థ ఇంచు ఇనుప పైపుకి వెల్డింగ్ చేయించి దానికి పివిసి పైప్ కి తీగతో కట్టాలి.
ఈ విధంగా తయారు చేసుకున్న యంత్రాన్ని ఒకరు ముందుకు లాక్కొని వెళ్తుంటే వరిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఇనుప గొలుసులు తగులుకొని బయటకు వస్తాయి అదేవిధంగా వరిలో ఉన్నటువంటి పురుగు నీటిలో పడి చనిపోతుందని రైతు తెలిపాడు.ఈ విధంగా గత ఏడాది నుంచి తాను వరిలో కలుపు తీయడానికి అదే యంత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు యువరైతు తెలిపాడు. ఈ యంత్రం ఉపయోగించడం వల్ల కూలీలు అవసరం లేకుండా సొంతంగా తన పొలంలో కలుపు తీసుకోగలుగుతున్నానని, ఈ రైతును చూసి మరెంతోమంది రైతులు ఇదే బాటలో పయనిస్తున్నారు అని చెప్పవచ్చు.
Share your comments