వ్యవసాయ రంగం లో ఎన్ని ఆవిష్కరణలు వచ్చిన అవి మారుమూల ప్రాంత రైతులకు చేరుకోవడం లేదు ఒకలేవ ఆ ఆవిష్కరణలు గ్రామీణ స్థాయికి చేరుకున్న భారత దేశం లో చిన్న సన్నకారు రైతులే అధికంగ ఉండడంతో టెక్నాలజీ తో కూడిన ఆవిష్కరణలు రైతులకు పెట్టుబడి భారం గ మారుతున్నాయి , దీనికి భిన్నం గ ఆలోచించిన నర్వ మండలం నారాయణ పేట జిల్లా తెలంగాణ కు చెందిన రైతు తక్కువ ఖర్చుతో ఎడ్ల బండి తో నడిచే పురుగుల మందు పిచికారీ మరియు మొక్కలకు నీరు అందించే నూతన యంత్రాన్ని తయారు చేశాడు .
ఈ నూతన ఆవిష్కరణమును TSIC తన ట్విటర్ వేదిక ద్వారా పంచుకున్నది , తలుచుకుంటే సాధించనిది అంటూ ఏది ఉండదని రైతు చేసిన ఈ వినూత్నన ఆలోచన రైతులందరిని ఆకట్టుకుంటున్నది.
TSIC ఏమిటి ?
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 'ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ 2022' యొక్క నాల్గవ ఎడిషన్‌ను నిర్వహించింది. అంతర్గతంగా దాగివున్న నూతన ఆవిష్కరణలను బయటకు తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ,మరియు ఆవిష్కర్తలు, వ్యక్తులు మరియు పరిపాలన మధ్య వేదికగా ఉపయోగపడుతుంది.
అగ్రి జర్నలిస్టుగ మరలనుకుంటున్నారా ? కృషి జాగరణ్ తో చేతులూ కలపండి ..
ఎగ్జిబిషన్‌లో గ్రామీణ ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు చెందిన ఆవిష్కర్తలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 700 కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయి మరియు వాటిలో 163 ఆవిష్కరణలు సంబంధిత జిల్లా కలెక్టర్ల ముందు ప్రదర్శించబడ్డాయి. 160 మందికి పైగా జిల్లా పరిపాలన అధికారుల కోసం ఇన్నోవేషన్ మరియు ప్రాసెస్ టు స్కౌట్ ఇన్నోవేటర్స్ అనే కాన్సెప్ట్‌పై వర్క్‌షాప్ నిర్వహించబడింది.
Share your comments