Agripedia

ఈ రకం హైబ్రిడ్ టమోటాలతో అధిక దిగుబడులు పొందుతున్న రైతులు..

Gokavarapu siva
Gokavarapu siva

వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి అనుగుణంగానే వివిధ రకాల పంటలలో నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. బెంగుళూరులోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్ధకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.టి సదాశివ అన్ని రకాల వైరస్, బ్యాక్టీరియా తెగుళ్ళను తట్టుకునే "ఆర్క రక్షక్" పేరుతో హైబ్రీడ్ టొమాటో రకాన్ని అభివృద్ధి చేశారు.

అత్యంత ప్రాచుర్యం పొందిన ఆర్క రక్షక్ హైబ్రీడ్ టొమాటో రకాన్న ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంతో పాటు,ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ , హర్యానా వంటి రాష్ట్రాల రైతులు అర్కా రక్షక్ టొమాటో సాగును చేపట్టి అధిక దిగుబడులను సాధిస్తూ, మంచి ఫలితాలను పొందుతున్నారు. కావున ఈ హైబ్రిడ్ టొమాటో యొక్క గుణగణాలను, సాగు పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్క రక్షక్ హైబ్రీడ్ టొమాటో సాగు చేయడానికి అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. పంట కాలం140- 150 రోజుల్లో ఉండి, ఎకరాకు 25- 30 గ్రాముల విత్తనం సరిపోతుంది.ప్రస్తుతం మార్కెట్లో ఈ విత్తనం ధర డిమాండ్ను బట్టి 700 రూపాయలు పలుకుతోంది. ఒక్కో మొక్కకు 18 నుంచి 20 కిలోల టమోటో దిగుబడి ఇచ్చి ఎకరాకు దాదాపు 55 టన్నుల అధిక నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు.

ఇది కూడా చదవండి..

సామాన్యులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పాల ధరలు..

ముదురు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉండే ఈ టమోటో రకం ఆకుముడత, ఎండు తెగులు, బ్యాక్టీరియా, వైరస్ తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకుని అధిక నాణ్యమైన దిగుబడినిస్తుంది. ఈ టమోటో ప్రత్యేకత ఏమిటంటే దాదాపు పదిహేను రోజులు నిల్వ సామర్థ్యం కలిగి ఉండడంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర లభిస్తోంది.

అర్కరక్షక్ హైబ్రిడ్ టమోటా సాగు చేపట్టే రైతులు తగిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి..

సామాన్యులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పాల ధరలు..

Share your comments

Subscribe Magazine