భారత కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో పీఎం కుసుం యోజన (PM Kusum Yojana) అనే మరో గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పన మరియు రైతుల తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకొని ఆర్థికంగా ఎదగడానికి తమకున్న వ్యవసాయ భూములలో కొంత ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా వ్యవసాయ క్షేత్రంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయంను పొందవచ్చుననే లక్ష్యంతోకేంద్ర ప్రభుత్వం ఈ పథకంను తీసుకొచ్చింది.
ప్రధానమంత్రి కుసుం యోజన పథకంలో భాగంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో పంటలు పండిస్తూనే ఖాళీ స్థలంలో సౌర విద్యుత్ ప్యానల్ ఏర్పాటు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అమ్మడంతో లాభాలను పొందవచ్చు.మరియు తమ భూమిని అద్దెకు విద్యుత్ సంస్థలకు ఇచ్చినట్లయితే దానికి ప్రతిఫలంగా దాదాపు 4 లక్షల వరకు అద్దె ద్వారా ఆదాయం పొందవచ్చు.
ఈ పథకానికి సంబంధించి కొన్ని నియమాలను, ప్రయోజనాలను తెలుసుకుందాం.ఈ పథక యొక్క ప్రయోజనాన్ని రైతులు పొందాలంటే ముందుకు ఏదైన విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకోవల్సి ఉంటుంది.ఈ ఒప్పందం 25 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. సౌరవిద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి మొత్తం ఖర్చు ఆయా సంస్థలు భరిస్తాయి. రైతుల పై ఎటువంటి భారం ఉండదు. కేవలం రైతులు తమ భూమిలో మూడింట ఒక వంతు భూమిని అద్దెకిస్తే సరిపోతుంది. దీనికి ప్రతిఫలంగా ఆయా విద్యుత్ సంస్థలు ఎకరాకు లక్ష చొప్పున రైతులకు అద్దె రూపంలో చెల్లిస్తారు.
Share your comments