చిరుధాన్యాల్లో పోషకల విలువలు అధికంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వీటిల్లో ఉండే విటమిన్ బీ-17 క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే, పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం మూలంగా వీటిని తింటే ఊబకాయం తగ్గుతుంది. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ 55 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల చక్కెర సంబంధిత వ్యాధులు, మోకాళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి.
అలాగే, మన శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తాయి. కాబట్టి చిరు ధాన్యాలకు మర్కెట్ లో డిమాండ్ అధికంగానే ఉంటుంది. వీటిని సాగు చేసిన రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ప్రస్తుతం చిరుధాన్యాలైన రాగులు సైతం అధిక పోషకాలు కలిగి ఉండటంతో వాణిజ్య పరంగా మార్కెట్ లో వీటికి అధిక డిమాండ్ ఉంది. అలాంటి రాగులను ఎలా సాగు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రాగులను సాగు చేయు విధానం:
రెండు తెగులు రాష్ట్రాల్లోనూ రాగులను సాగు చేస్తున్నారు. రాగుల సాగుకు దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే, తేలిక రకం ఇసుకు నేలలతో పాటు బరువు నేలల్లో రాగుల దిగుబడి మంచిగా వస్తుంది. అధికంగా నీరు నిల్వ ఉండే నేలల్లో రాగుల సాగుకు అనుకూలంగా ఉండవు. నేలను రెండు మూడు సార్లు దున్నుకోవాలి. ఒక ఎకరం పొలంలో 4 టన్నుల వరకు పవువుల ఎరువులు వేసుకుంటే పంట మంచిగా వస్తుంది. మొత్తగా దున్నిన నాడుమడి భూమిలో విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి.
మిర్చి రికార్డు ధర క్వింటా 80 వేలు ...
ఆ తర్వాత చదును చేసే వాటితో నేలను చదును చేయాలి. ఇలా చేయడం వల్ల మొలక శాతం పెరుగుతుంది. మొక్కలు పెరగడానికి నీరు అందించాలి. ఎకరాకు నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది. ఆ తర్వాత మనం సాగు చేస్తున్న రకాలకు అనుగుణంగా 20-30 రోజుల వ్యవధిలో పొలంలో నాటుకోవాలి. వరుసల మద్య 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. నారు నాటే ముందు కలపు మందులను పొలంలో పిచికారీ చేసుకుంటే కలుపు రాకుండా ఉంటుంది. దీంతో దిగుబడి పెరుగుతుంది. పంట పెరుగుదలకు అనుగుణంగా నత్రజని, డీఏపీ ఎరువులను వాడుకోవాలి. విత్తన రకాలను బట్టి కాలం సాధారణంగా 100 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది.
Share your comments