చెరకును ఎక్కువ శాతం రైతులు చక్కెర మరియు బెల్లం తయారీకి వాడతారు. వాటిని తయారు చేసిన తరువాత చెరకు నుండి వచ్చిన వ్యర్ధాన్ని ఎందుకు పనికి రాదు అని చాల మంది రైతులు అభిప్రాయ పడుతుంటారు. కానీ శాస్త్రవేత్తలు ఈ పిప్పిని డబ్బులుగా మార్చే ఉపాయాన్ని కనిపెట్టారు. ఈ పద్దతి వాళ్ళ రైతులకు పంటతో పాటు అదనంగా ఆదాయం వస్తుంది. దానితో పాటి ఈ వ్యర్ధాలతో కప్పులు, మరియు ప్లేట్లు కూడా తయారు చేయవచ్చు.
చెరకు పంటను కోత కోసిన తర్వాత వచ్చే వ్యర్ధాన్ని బయోమాస్ గా వర్ణిస్తారు. ఈ చెరకు పిప్పిని ఒక యంత్రంలో వేసి బ్రికెట్స్ గా తయారు చేస్తారు. బ్రికెట్స్ అంటే ఓ మోస్తరు కర్రలు మాదిరిగా ఉంటాయి. ఈ బ్రికెట్స్ ను వంట చేసుకోవడానికి కట్టెలుగా వాడుకోవచ్చు. పైగా దానితోపాటు ఈ పిప్పి నుండి శుభకార్యాల్లో వాడే ప్లేట్లు మరియు కప్పులను కూడా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ బ్రికెట్స్ ని తయారు చేయడానికి అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు బ్రికెటింగ్ యంత్రాన్ని తయారుచేసారు.
ఈ వ్యర్ధాలను వాటి రూపంలో నిల్వచేయడం కన్నా ఈ బ్రికెట్స్ రూపంలో నిల్వ చేయడం వలన చాలా తక్కువ స్థలం అవసరం అవుతుంది. ఇంచుమించుగా 30 టన్నుల పిప్పి అనేది వంద టన్నుల చెరకు నుండి వస్తుంది. సుమారుగా మనం ఒక తన్ను పిప్పి నుండి 35 టన్నుల బ్రికెట్స్ తయారు చేయచ్చు అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. సాధారణంగా ఈ పిప్పిని పొలాల్లోనే తగలబెట్టడం లేదు అలా వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన వారికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ ఈ బ్రికెటింగ్ [పద్దతి ద్వారా రైతులు అధిక లాభాన్ని పొందవచ్చు.
ఇది కూడా చదవండి..
మట్టి లేకుండా బంగాళదుంపలను పెంచే ఈ విశిష్ట పద్ధతి మీకు తెలుసా!
ఈ బ్రికెట్స్ ద్వారా అధిక ఉష్ణశక్తిని కూడా తయారుచేయవచ్చు. సాధారణ చెరకు పిప్పిని వంటకు వాడితే 1,200 నుంచి 1,300 కిలో కేలరీల ఉష్ణశక్తి అనేది కిలో పిప్పికి ఉత్పత్తి అవుతుంది. కానీ దానినే ఒక బ్రికెట్స్ రూపంలోకి మార్చి మండిస్తే 4,452 కిలో కేలరీల ఉష్ణశక్తి కిలో బ్రికెట్స్ ఉత్పత్తి అవుతుంది. ఈ బ్రికెట్స్ మండించినప్పుడు ఎక్కువ పొగ కూడా ఉత్పత్తి అవ్వదు. కాబట్టి ఈ బ్రికెట్స్ కి రెస్టారెంట్లు, హోటళ్లలో ఎక్కువగా వాడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఒక టన్ను బ్రికెట్స్ కి రూ.5వేల నుంచి రూ.5,500 వరకు ధర పలుకుతుంది. ఆశ్చర్యంగా ఒక టన్ను చెరకు పిప్పికిఁ కేవలం రూ.2,850 ధర మాత్రమే మార్కెట్లో ఉంది. ఈ చెరకు పిప్పి నుండి బ్రికెట్స్ తయారుచేయడానికి ముందుగా ఆ పిప్పిని ఎందబెట్టి 7-12 శాతం తేమను తీసుకురావాలి. తరువాత ఆ పిప్పిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను బ్రికెటింగ్ యంత్రంలోని హేమర్ మిల్లు ద్వారా పొడిచేసి బేరల్ ద్వారా పంపించి ఒత్తిడికి గురిచేయాలి. ఈ యంత్రం నుండి బ్రికెట్స్ అనేవి తయారవుతాయి.
ఇది కూడా చదవండి..
Share your comments