అహర్నిశలు శ్రమించి పంట పండించిన రైతులకు ప్రస్తుత కాలం లో ధాన్యం విక్రయించడం కూడా ఒక సవాలుగా మారింది ఇదే క్రమంలో కొన్ని రోజులలో పప్పు పంటలైన శనగలు,మినుములు,వేరుశనగ,పేసర్లు మార్కెట్టుకు రానున్నాయి దీనితో దళారుల చేతులలోన రైతులు మోస పోయే అవకాశం ఉండడంతో రైతు లనుంచి రబీ సీజన్ లో పప్పుధాన్యాల కొనుగోలులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .
మొత్తంగా 1,22,933 టన్నుల శనగలు, 99,278 టన్నుల మినుములు, 45,864 టన్నుల వేరుశనగ, 19,403 టన్నుల పెసలను సేకరించనుంది.
ఇప్పటికే శనగల కొనుగోలు ప్రారంభించగా, ఏప్రిల్ 1 నుంచి మిగతా పప్పుధాన్యాల కొనుగోలుకు మార్క్ ఫెడ్ ఏర్పాటు చేసింది. ధరలు ఇలా(క్వింటా).. శనగలు-రూ.5,335: పెసలు-రూ.7,755: మినుములు-రూ.6,600: వేరుసెనగ-రూ.5,850 గా నిర్ధారించారు.
రైతులు సమీప ప్రభుత్వ మార్కెట్లలో ధాన్యాలను విక్రయించాలని అధికారులు తెలుపుతున్నారు .
2022-23 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం (ఖరీఫ్ మాత్రమే), దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 149.92 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది, ఇది గత ఐదు సంవత్సరాల (2016-17 నుండి 2020- వరకు) సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 6.98 మిలియన్ టన్నులు ఎక్కువ. 21)
యాసంగి :తెలంగాణాలో 57 లక్షల ఎకరాలలో వరి సాగు ..
2022-23లో ఖరీఫ్ బియ్యం (వరి) మొత్తం ఉత్పత్తి 104.99 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడింది. గత ఐదు సంవత్సరాల (2016-17 నుండి 2020-21) సగటు ఖరీఫ్ బియ్యం ఉత్పత్తి 100.59 మిలియన్ టన్నుల కంటే ఇది 4.40 మిలియన్ టన్నులు ఎక్కువ.ఖరీఫ్‌లో అత్యధికంగా వరి, రబీలో పప్పుధాన్యాలు ఎక్కువగా సాగు చేస్తారు.
Share your comments