జలచరాలతో పాటు వరి పంటను సాగు చేయడం ద్వారా వల్ల రైతు దిగుబడి ని పెంచవచ్చు రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని తగ్గించవచ్చని ఈలైఫ్ అనే జర్నల్ లో ఈ రోజు ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. అదేవిధంగ వరి సాగుచే క్రమం లో రసాయన ఎరువులు వాడకం తాగించిందా ద్వారా పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.
అధ్యయనం యొక్క ఫలితాలు:
ఆధునిక కాలం లో రైతులు పొలాలలో తరచుగా ఒక రకమైన పంటను మాత్రమే సాగుచేస్తారు మరియు పెద్ద మొత్తంలో ఎరువులు మరియు పురుగుమందులు వాడుతున్నారు ,ఇది పంట ఉత్పత్తికి సహాయపడింది, కానీ ఎక్కువ పర్యావరణకాలుష్యాన్ని కల్గించింది.
కొంతమంది రైతులు రసాయన ఎరువుల స్థానం లో మొక్కలు -జంతువుల పరస్పర చర్యలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యవసాయ లో రసాయనాల అవసరాన్ని తాగించి అధిక లాభాలు పొందడానికి ప్రయోగాలు కొనసాగిస్తున్నారు .
చైనాలోని హాంగ్ఝౌలోని జెజియాంగ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో అయిన లియాంగ్ గువో ఇలా : "వరి
పంటలో పీతలు లేదా సాఫ్ట్ షెల్ తాబేళ్లతో లను పెంచి పరిశోధనలు చేసారు ,సాధారణ పంటలతో పోలిస్తే జలచరాలు వున్నా పిల్లల్లో కలుపు చాలావరకు తగ్గిందని మరియు రసాయన ఎరువుల అవసరం లేకుండా పొలం లో నత్రజని శాతం సాధారణం కంటే పెరిగిందని జెజియాంగ్ విశ్వవిద్యాలయం యొక్క కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో పిహెచ్ డి విద్యార్థి అయిన లుఫెంగ్ జావో చెప్పారు.
అప్పుడు పరిశోధకులు వరి పంటలో జంతువులు ఏమి తింటాయి అని పరిశీలించారు. అవి మొక్కల యొక్క నిర్జీవ భాగాలూ మరియు ఇతర చిన్న చిన్న జీవులను తింటాయని కనుకొన్నారు . జంతువులు తీసుకోని మిగిలిపోయిన మేత నుండి వరి మొక్కలు సుమారు 13-35 శాతం నత్రజనిని ఉపయోగించాయని కూడా వారు కనుగొన్నారు.
జలచరాలతో వరి ని పెంచడం వల్ల దిగుబడి సాధారంగా పండించే పంట కంటే 8.7 నుండి 12.1 శాతం ఎక్కువ. మరియు అంతర పంటగా ఈ చేపలు మరియు పీతల ద్వారా వచ్చే ఆదాయం అదనం .
"ఈ పరిశోధనలు వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలలో జంతువుల పాత్రల పై మా అవగాహనను మెరుగుపరుస్తాయి మరియు జంతువులతో పాటు పంటలు పండించడం అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నదనే అభిప్రాయానికి మద్దతు ఇస్తుంది" అని జెజియాంగ్ విశ్వవిద్యాలయం యొక్క కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లోని పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్ మరియు డాక్టర్ లియాంగ్లియాంగ్ హు మరియు ప్రొఫెసర్ జియాన్జున్ టాంగ్ లతో అధ్యయనం యొక్క సహ-సీనియర్ రచయిత క్సిన్ చెన్ చెప్పారు.
ఇంకా చదవండి.
Share your comments